ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Sun Transit: నవంబర్ మూడో వారం చివరి నుంచి ఈ రాశులకు అదృష్ట యోగం

ABN, Publish Date - Nov 02 , 2025 | 03:30 PM

సూర్యుడు తన సంచారాన్ని మార్చుకోనున్నాడు. దీని వల్ల ద్వాదశ రాశుల వారి జీవితాల్లో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి.

ప్రత్యక్ష నారాయణుడు సూర్యుడు. కాలానుగుణంగా ఆయన.. తన రాశిని మారుస్తూ ఉంటాడు. ప్రతినెలా సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తాడు. సూర్యుడు ఇలా రాశి మార్పునకు చెందినప్పుడు.. ద్వాదశ రాశుల వారి జీవితంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. శని నక్షత్రంలో సూర్యుడు సంచారం 12 రాశుల వారిపై ప్రభావం పడుతుంది. అయితే కొన్ని రాశుల వారు శుభ ఫలితాలు పొందితే.. మరికొన్ని రాశుల వారు అశుభ ఫలితాలు అందుకుంటారు. సూర్యుడు ఇలా మార్పు చెందినప్పుడు కెరీర్ ఫైనాన్స్, వ్యాపారంపై తీవ్ర ప్రభావం పడుతుంది.

నవంబర్ 19వ తేదీ సూర్యుడు అనురాధ నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. డిసెంబర్ 2వ తేదీ వరకు ఆయన ఆ నక్షత్రంలోనే సంచారం చేస్తాడు. ఇక అనురాధ నక్షత్రానికి అధిపతి శని. ఇందులో సూర్యుడు సంచారం చేయడం వల్ల ద్వాదశ రాశుల వారిపై ప్రభావం పడుతుంది. ముఖ్యంగా ఈ రాశుల్లో కొన్ని రాశుల వారు అధిక లాభాలు పొందుతారు.

మిథున రాశి:

ఈ రాశి వారికి సూర్య సంచారం బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు అధిక లాభాలు అందుకుంటారు. వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది. కెరీర్‌లో కూడా పురోగతి చూస్తారు. ఉద్యోగులకు ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్లు పొందుతారు. అలాగే కార్యాలయాల్లో కొత్త బాధ్యతలను చేపడతారు. ఆర్థికంగా మంచి ఫలితాలు ఉంటాయి. భాగస్వామితో అధిక సమయాన్ని గడుపుతారు.

సింహ రాశి:

ఈ రాశి వారికి సూర్య సంచారం బాగా కలిసి వస్తుంది. ఈ రాశి వారు మతపరమై కార్యక్రమాల్లో పాల్గొంటారు. శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది. అదృష్టం మీతోనే ఉంటుంది. చాలా కాలంగా వాయిదా పడుతున్న పనులు.. ఈ సమయంలో పూర్తవుతాయి.

వృశ్చిక రాశి:

ఈ రాశి వారు అనేక లాభాలు పొందుతారు. ఈ సమయంలో ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు. ఉద్యోగంలో పురోగతిని చూస్తారు. నూతన ఆదాయాన్ని అందుకుంటారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యాపార పరిస్థితులు బావుంటాయి. కుటుంబంలో శాంతి, సంతోషాలు నెలకొంటాయి.

ఈ వార్తలు కూడా చదవండి..

కార్తీకంలో ఏకాదశి.. మహావిష్ణువుకు పూజలు ఎందుకంటే.. ?

ఇంతకీ కార్తీక పౌర్ణమి ఎప్పుడు? ఆ రోజు ఏం చేయాలి.. ?

For More Devotional News And Telugu News

Updated Date - Nov 02 , 2025 | 04:22 PM