ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Narayaneeyam: సంపూర్ణ నారాయణీంకు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు

ABN, Publish Date - Dec 28 , 2025 | 11:05 AM

అనకాపల్లిలో నిర్వహించిన సంపూర్ణ నారాయణీయం పారాయణ కార్యక్రమం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. శ్రీకృష్ణ మాధురీయం బృందం ఆధ్వర్యంలో జరిగిన ఈ పారాయణంలో భక్తులు భక్తిశ్రద్ధలతో నారాయణీయాన్ని పఠించారు.

Narayaneeyam Parayanam

ఆంధ్రజ్యోతి, డిసెంబర్ 28: అనకాపల్లి పట్టణంలో నిర్వహించిన సంపూర్ణ నారాయణీయం పారాయణకు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కింది. దాదాపు 15 వందల మంది భక్తులు భక్తిశ్రద్ధలతో ఈ పారాయణీయం కార్యక్రమంలో పాల్గొనడం విశేషం. శ్రీకృష్ణ మాధురీయం బృందం వారిచే నిర్వహించిన ఈ పారాయణీయం కార్యక్రమంలో భక్తులు పాల్గొని నారాయణీయం పారాయణ చేశారు.

స్థానిక శ్రీమతి కడ్మిశెట్టి నాగ మాధురి ఆధ్వర్యంలో జరిగిన ఈ భక్తిపారాయణంకు నారాయణీయం సాధకులు, పురజనులు విశేష సంఖ్యలో హాజరయ్యారు. ఉదయం 8 గంటలకు పారాయణ ప్రారంభమై, 4 గంటలకు గౌరవ సభ నిర్వహించారు. అనకాపల్లిలోని గవరపాలెం సత్యాస్ లక్ష్మీ గ్రాండ్‌లో జరిగిన ఈ వేడుక స్థానికంగా ఆధ్యాత్మిక శోభను సంతరింపచేసింది.

అనకాపల్లి జిల్లా అనకాపల్లికి చెందిన కడ్మిశెట్టి నాగ మాధురి నవీన్, ఆధ్వర్యంలో శ్రీమన్ నారాయణీయం నుండి 1,036 శ్లోకాలతో కూడిన భారీ సమూహిక పఠనాన్ని విజయవంతంగా నిర్వహించి, నాయకత్వం వహించారని ధృవీకరించినట్టు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ పేర్కొంది.

సాంస్కృతిక, ఆధ్యాత్మిక సంస్థ అయిన 'శ్రీ కృష్ణ మాధురియం' ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్త బృందం, అద్భుతమైన సమన్వయం, సమిష్టి భాగస్వామ్యం, ఆధ్యాత్మిక సాహిత్యాన్ని పరిరక్షించడంలో అంకితభావాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ద్వారా అధికారికంగా గుర్తించబడిందని సదరు సంస్థ వెల్లడించింది.

తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఈ ఆధ్యాత్మిక క్రతువును సగర్వంగా గుర్తిస్తుందని వెల్లడించింది.

ఇవి కూడా చదవండి

ఇది మృత్యువుతో ఆడుకోవడం కాక మరేంటి.. ఈ మహిళల ప్రమాదకర విన్యాసం చూస్తే..

పెళ్లిలో ఊహించని సంఘటన.. భర్తను ముద్దు పెట్టుకున్న మాజీ ప్రియురాలిపై..

Updated Date - Dec 28 , 2025 | 01:45 PM