Ayyappa Swamy 18 steps: అయ్యప్ప స్వామి ఆలయంలో 18 మెట్లు..ప్రతి మెట్టుకు ఒక్కో ప్రత్యేకత..
ABN, Publish Date - Dec 24 , 2025 | 11:02 AM
కార్తీక మాసం మొదలైందంటే చాలు లక్షలాదిమంది భక్తులు అయ్యప్ప స్వామి దీక్షలు ప్రారంభిస్తారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, దక్షిణ భారతదేశంలో పలు రాష్ట్రాల్లో నవంబర్ నుంచి జనవరి వరకు ఎక్కడ చూసినా అయ్యప్ప భక్తులే కనిపిస్తుంటారు. అయ్యప్ప మాల అంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు.. 41 రోజుల పాటు కఠిన నియమ, నిష్టలతో స్వామియే శరణం అయ్యప్ప అంటూ మండల దీక్ష చేపడతారు.
దేశంలో ప్రసిద్ది పొందిన ఆలయాల్లో కేరళ (Kerala)లోని శబరిమల అయ్యప్ప స్వామి(Sabarimala Ayyappa Swamy) ఆలయం (Temple) ఒకటి. కేరళలోని పత్తినంతిట్ట జిల్లా(Pathinanthitta District)లో సహ్యాద్రి పర్వత శ్రేణుల ప్రాంతంలో.. సముద్ర మట్టం నుంచి సుమారు 400 అడుగుల ఎత్తులో దట్టమైన అడవులు, కొండల మధ్య అయ్యప్ప స్వామి ఆలయం ఉంది. కార్తీమ మాసంలో ఈ ఆలయం కొద్ది రోజులు మాత్రమే తెరుచుకుంటుంది.ప్రతి సంవత్సరం లక్షల మంది భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించుకుంటారు. స్వామి వారి ఆలయం ముందున్న 18 మెట్ల(18 Stairs)ను ‘పదెనెట్టాంబడి’( Pathinettam Padi) అని అంటారు.ఎందుకు 18 మెట్లే ఉన్నాయి.. వాటి విశిష్టత ఏంటీ? మెట్ల వెనుక రహస్యం ఏంటీ? ఒక్కో మెట్టుకు ఉన్న ప్రత్యేకత ఏంటీ? ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం...
ప్రతి సంవత్సరం నవంబర్ నుంచి జనవరి వరకు కోట్ల మంది భక్తులు(Devotees) అయ్యప్ప స్వామి మాల వేసి ఇరుముడితో పంబ నది దగ్గర నుంచి శబరి గిరులన్నీ దాటుకొని స్వామియే శరణం అయ్యప్ప నామ స్మరణతో స్వామివారిని దర్శించుకుంటారు. అయ్యప్ప మాల వేసి ఇరుముడితో వచ్చేవారికి 18 స్వర్ణ మెట్లు వెళ్లేందుకు అనుమతిస్తారు. సాధారణ భక్తులకు అనుమతించరు. ఈ 18 మెట్లు ఎందుకు ఏర్పాటు చేశారో తెలుసుకుందాం. అయ్యప్ప స్వామి శబరిగిరిలో కొలువైయ్యేందుకు 4 వేదాలు, 2 శాస్త్రాలు, అష్టదిక్పాలకులు, విద్య, అవిద్య,జ్ఞానం అనే దేవతా రూపాలు 18 మెట్లుగా మారడంతో ఆ మెట్లపై అడుగేస్తూ.. ఆలయంలోకి వెళ్లిన స్వామి పట్టబంధాసనంలో కూర్చుని చిన్ముద్ర, అభయహస్తాలతో దర్శనమిచ్చి యోగ సమాధిలోకి వెళ్లి.. జ్యోతి రూపంలో భక్తులకు కనిపిస్తారని పురాణాలు చెబుతున్నాయి.
అయ్యప్ప స్వామి 18 మెట్ల అష్టాదశ దేవతలు ఎవరంటే.. 1.మహంకాళి 2.కళింకాళి 3.భైరవ 4.సుబ్రహ్మణ్యం 5.గంధర్వరాజ 6.కార్తవీర్య 7.క్రిష్ట పింగళ 8.భేతాళ 9.మహిషాసుర మర్ధిని 10.నాగరాజ 11.రేణుకా పరమేశ్వరి 12. హిడింబ 13.కర్ణ వైశాఖ 14.అన్నపూర్ణేశ్వరి 15.పుళిందిని 16.స్వప్న వారాహి 17.ప్రత్యంగళి 18. నాగ యక్షిణి.
18 మెట్ల పేర్లు.. 1) అణిమ 2)లఘిమ 3)మహిమ 4)ఈశ్వత 5)వశ్యత 6)ప్రాకామ్య 7)బుద్ది 8) ఇచ్చ 9)ప్రాప్తి 10)సర్వకామ 11)సర్వ సంపత్కర 12)స్వర ప్రియకర 13) స్వరమంగళాకార 14) సర్వ దుఃఖ విమోచన 15)స్వర మృత్యుప్రశమన 16) సర్వవిఘ్ననివారణ 17)సర్వాంగ సుందర 18) సర్వ సౌభాగ్యదాయక.
18 మెట్ల విశిష్టత..మణికంఠుడి సన్నిధానంలో ఉన్న తొలి 5 మెట్లు మనిషి యొక్క పంచేంద్రియాలతో సమానం. కళ్లు, చెవులు, ముక్కు, నాలుక, స్పర్శలకు ఇది ప్రతికలుగా నిలుస్తాయి. మనిషులు ఎప్పుడూ మంచిపైనే దృష్టి ఉంచాలి.. మంచి మాట్లాడాలి, విశ్వసించాలి, వినాలి అని సూచిస్తుంది. 8 మెట్లు రాగద్వేషాలకు సంకేతం అని చెబుతారు. అంటే.. కామం, మోహం, క్రోదం,మోహం, లోభం, మధం, మాస్తర్యం,అసూయ,డాంభికాలు(గొప్పలు) వదిలేసి మంచి మార్గంలో పయణించాలని సూచిస్తాయి. 3 మెట్లు త్రిగుణాలకు సంబంధించినవిగా చెబుతారు. అవి సత్వ, తమో, రజో గుణాలకు ప్రతీకగా నిలుస్తాయి. ఇక చివరి రెండు మెట్ల విద్య, అవిద్యను సూచిస్తాయి. దీనర్ధం గొప్ప జ్ఞానం పొందాలంలే అవిద్య, అజ్ఞానం, అహంకారం వదలాలని సంకేతం.
ప్రతి మెట్టుకో ప్రత్యేకత.. అయ్యప్ప స్వామి 18 మెట్ల ఎక్కుతూ తన వద్ద ఉన్న అస్త్రాలు ఒక్కొక్కటి ఒక్కో మెట్టు దగ్గర విడిచిపెట్టారని అంటారు. ఆ ఆస్త్రాల పేర్లు ఏంటో తెలుసుకుందాం. 1)శరం 2)క్షరిక 3)డమరుకం 4)కౌమోదం 5)పాంచజన్యం 6)నాగాస్త్రం 7)హలాయుధం 8)వజ్రాయుధం 9)సుదర్శనం 10)దంతాయుధం 11) నఖాయుధం 12)వరుణాయుధం 13)వాయువ్యాస్త్రం 14)శర్ఞాయుధం 15)బ్రహ్మాస్త్రం 16) పాశుపాతాస్ట్రం 16)శూలాయుధం 18)త్రిశూలం
ఇరుముడి తలపై పెట్టుకొని అయ్యప్ప భక్తులు ఈ మెట్లు అధిరోహించడం అనేది గొప్ప అనుభూతి. మన శరీరం, ఆత్మ, మనసులను నియంత్రిస్తూ స్వామి రూపాన్ని మన గుండెల్లో ప్రతిష్టించుకోవడం. ఈ మార్గంలో ఎదురుయ్యే ప్రతి కష్టం ఆ మణికంఠుడు పెట్టే పరీక్షలే. వీటిలో నెగ్గితే మోక్ష మార్గం కళ్లెదుట కనిపిస్తుందని భక్తుల విశ్వాసం.
గమనిక : ఈ సమాచారం, అయ్యప్ప స్వామికి సంబంధించిన వివరాలన్నీ మత విశ్వాసాలపై ఆధారపడి తీసుకున్నవి మాత్రమే. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.
Also Read:
న్యూ ఇయర్ పార్టీ.. ఇండియాలో బెస్ట్ బీచ్ డెస్టినేషన్స్ ఏవో తెలుసా?
కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు శరీరంలో కనిపించే సంకేతాలు ఇవే.!
For More devotional
Updated Date - Dec 24 , 2025 | 11:20 AM