Deepawalii Celebration: ఆ దేశంలో వెరైటీ దీపావళి.. ఎన్ని రోజులంటే..
ABN, Publish Date - Oct 19 , 2025 | 10:11 AM
దీపావళి అంటేనే వెలుగుల పండగ. ఈ పండగను వెరైటీగా ఐదు రోజుల పాటు జరుపుకుంటారు. అది కూడా భారత్‌లో కాదు..
Deepavali Celebrations In Nepal: దీపావళి అంటేనే వెలుగుల పండగ. ఈ పండగను ఇండియాలోనే కాకుండా.. పొరుగునున్న నేపాల్‌లో సైతం జరుపుకుంటారు. అది కూడా ఒకటి రెండు రోజులు కాదు.. ఏకంగా ఐదు రోజుల పాటు.. ఒక్కొరోజు ఒక్కో తీరుగా ఈ పండగను చేసుకుంటారు. ఈ దీపావళిని నేపాల్‌లో తిహార్ అని పిలుస్తారు. తిహార్ అంటే యమ పంచక్ అని కూడా అంటారు. దీని వెనుక యమధర్మరాజు, ఆయన సోదరి యమునతో ముడిపడిన కథ ఉందని స్థానికులు చెబుతారు. ఈ పండగ ప్రకృతి, మూగ జీవుల పట్ల గౌరవాన్ని ప్రతీకగా సూచిస్తుందంటారు.
తొలి రోజు..
కాగ్ తిహార్ అని అంటారు. ఈ రోజును కాకులకు పూజిస్తారు. కాకులను యముడికి దూతలుగా పరిగణిస్తారు. ఈ రోజున కాకులకు మిఠాయిలతోపాటు ధాన్యాన్ని భక్తులు తినిపిస్తారు. ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో తమను అదృష్టం వరిస్తుందంటారు.
రెండో రోజు..
కుక్కూర్ తిహార్‌గా జరుపుకుంటారు. ఈ రోజు శునకాలను పూజిస్తారు. కుక్కలను సైతం యమధర్మరాజు రక్షకులు, దూతలుగా భావిస్తారు. ఈ రోజు.. శునకాల నుదిటిపై తిలకం పెట్టి.. వాటికి రుచికరమైన ఆహారాన్ని అందిస్తారు.
మూడో రోజు..
గాయ్ తిహార్‌గా జరుపుకుంటారు. ఈ రోజు ఆవులను పూజిస్తారు. హిందూ సంస్కృతిలో ఆవులను సంపదకు చిహ్నంగా పేర్కొంటారు. ఈ రోజు సాయంత్రం వేళ ఇళ్లను దీపాలతో అలంకరించి.. లక్ష్మీ పూజ నిర్వహిస్తారు.
నాలుగో రోజు..
గోరు తిహార్‌గా జరుపుకుంటారు. ఈ రోజు ఎద్దులను పూజిస్తారు. వ్యవసాయంలో ఎద్దుల కీలక భూమిక పోషిస్తాయి. అందుకు గౌరవంగా వాటిని పూజిస్తారు. మానవుని జీవితంలో జంతువులకు ముఖ్యమైన పాత్ర ఉందన్న సంగతి అందరికి తెలిసిందే. వాటి పట్ల కృతజ్ఞతను తెలపడం కోసం పూజిస్తారు.
ఐదో రోజు..
భాయ్ దూజ్‌గా జరుపుకుంటారు. ఇది సోదరిసోదరీమణుల మధ్య పవిత్రమైన బంధానికి సంబంధించిన వేడుక. ఈ రోజు.. సోదరీమణులు తమ సోదరుల నుదుటిపై తిలకం పెట్టి.. వారి ధీర్ఘాయువు, శ్రేయస్సు కోసం పూజ చేస్తారు. అందుకు ప్రతీగా సోదరీమణులకు సోదరులు బహుమతులు ఇస్తారు. ఇంకా చెప్పాలంటే.. మన రాఖీ పండగలాగా.. నేపాలీలు ఈ పండగను జరుపుకుంటారు.
ఈ వార్తలు కూడా చదవండి..
చెక్‌పోస్టులపై ఏసీబీ దాడులు.. భారీగా నగదు స్వాధీనం
మద్యం దుకాణాల దరఖాస్తులపై ప్రభుత్వం కీలక నిర్ణయం
For More Devotional News And Telugu News
Updated Date - Oct 19 , 2025 | 11:24 AM