ACB Raids On RTA Check posts: చెక్‌పోస్టులపై ఏసీబీ దాడులు.. భారీగా నగదు స్వాధీనం
ABN , Publish Date - Oct 19 , 2025 | 10:41 AM
దీపావళి పండగ వేళ.. తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు వాహనదారులు భారీగా రాకపోకలు కొనసాగిస్తారు. ఈ నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల్లోని చెక్ పోస్టులపై ఏసీబీ అధికారులు మెరుపు దాడులు చేశారు.
హైదరాబాద్, అక్టోబర్ 19: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీఏ చెక్ పోస్టులపై ఏసీబీ అధికారులు ఆదివారం మెరుపు దాడులు నిర్వహించారు. సంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, ఉమ్మడి ఆదిలాబాద్, కామారెడ్డి, కొమరం భీం జిల్లాల్లోని చెక్ పోస్టులపై ఏసీబీ అధికారులు దాడులు చేసి.. సోదాలు చేపట్టారు. సంగారెడ్డి జిల్లాలోని చిరాగ్‌పల్లి మండలం మాడ్గిలోని అంతరాష్ట్ర ఆర్టీఏ చెక్ పోస్టుపై గత అర్ధరాత్రి ఏసీబీ అధికారుల దాడి చేశారు. అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్‌లో ఏసీబీ సోదాలు నిర్వహించింది.
అదే విధంగా కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం సలాబత్‌పూర్ ఆర్టీవో చెక్ పోస్ట్‌లో సైతం ఏసీబీ అధికారుల సోదాలు చేపట్టారు. ఆ క్రమంలో బోరజ్ చెక్ పోస్టులో రూ.1, 26000 నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇక కొమురం బీమ్ జిల్లా వాంకిడి చెక్ పోస్ట్‌లో రూ.5,100 స్వాధీనం చేసుకున్నారు. నిర్మల్ జిల్లా బైంసా చెక్ పోస్టులో రూ. 3 వేల అక్రమ నగదు స్వాధీనం చేసుకున్నారు.
కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలం పోందుర్తి ఆర్టీఏ చెక్ పాయింట్ వద్ద ఏసీబీ అదికారుల దాడులు చేశారు. చెక్ పోస్టుల వద్ద ప్రైవేటు వ్యక్తుల నుండి రూ. 51,300 నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీపావళి వేళ.. తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు వాహనదారులు రాక పోకలు సాగిస్తారు. ఈ నేపథ్యంలో ఆవినీతికి ఆస్కారం ఏర్పడే అవకాశం ఉందనే ఫిర్యాదులు వెల్లవెత్తాయి. దాంతో తెలంగాణ సరిహద్దు జిల్లాల్లోని ఆర్టీఏ చెక్ పోస్టులపై ఏసీబీ అధికారులు దృష్టి సారించారు. ఆ క్రమంలో ఈ దాడులు చేపట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బాలుడి వద్ద బుల్లెట్.. రంగంలోకి దిగిన పోలీసులు
మద్యం దుకాణాల దరఖాస్తులపై ప్రభుత్వం కీలక నిర్ణయం
For More TG News And Telugu News