Bullet: బాలుడి వద్ద బుల్లెట్.. రంగంలోకి దిగిన పోలీసులు
ABN , Publish Date - Oct 19 , 2025 | 09:23 AM
బాలుడి వద్ద బుల్లెట్ లభ్యమైంది. అది కూడా హైదరాబాద్‌లోని మెట్రో స్టేషన్‌లో భద్రతా సిబ్బంది తనిఖీల్లో లభ్యమైంది. దీంతో సిబ్బంది ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు.
హైదరాబాద్, అక్టోబర్ 19: కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బుల్లెట్ కలకలం సృష్టించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శనివారం రాత్రి మెట్రోలో ప్రయాణించేందుకు బాలుడు మూసాపేటలోని స్టేషన్‌కు వచ్చాడు. విధుల్లో భాగంగా మెట్రో భద్రతా సిబ్బంది ఆ బాలుడిని తనిఖీ చేశారు. ఆ బాలుడి వద్ద బుల్లెట్‌ను మెట్రో సిబ్బంది గుర్తించారు. అతడి వద్ద నుంచి ఆ బుల్లెట్‌ను స్వాధీనం చేసుకున్నారు. నీ వద్దకు బుల్లెట్ ఎలా వచ్చిందంటూ ఆ బాలుడిని మెట్రో భద్రతా సిబ్బంది ప్రశ్నించారు.
అతడు సమాధానం చెప్పక పోవడంతో.. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మెట్రో స్టేషన్‌కు చేరుకుని బుల్లెట్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం బాలుడిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ బుల్లెట్ ఎలా లభ్యమైంది. ఎక్కడ లభ్యమైంది. రహదారిపై దొరికిందా? లేకుంటే ఎవరైనా ఇచ్చారా? అలా కాకుంటే.. ఎక్కడైనా దొంగిలించావా? అనే కోణంలో అతడిని పోలీసులు విచారిస్తున్నారు. అలాగే అతడి తల్లిదండ్రులకు సైతం పోలీసులు సమాచారం ఇచ్చారు. వారు వెంటనే పోలీస్ స్టేషన్‌కు తరలి వచ్చారు. బాలుడి వ్యవహార శైలిపై ఆ తల్లిదండ్రులను పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మద్యం దుకాణాల దరఖాస్తులపై ప్రభుత్వం కీలక నిర్ణయం
ఉద్యోగులకు దీపావళి ధమాకా.. ఒక డీఏ కానుక
For More TG News And Telugu News