Sravana Masam Last Friday: శ్రావణ మాసం.. ఆఖరి శుక్రవారం..
ABN, Publish Date - Aug 21 , 2025 | 07:55 AM
మాసాల్లో శుభమైన మాసం శ్రావణం. ఈ ఏడాది ఈ శ్రావణ మాసం మరికొన్ని గంటల్లో ముగియనుంది.
మాసాల్లో శుభమైన మాసం శ్రావణం. ఈ ఏడాది ఈ శ్రావణ మాసం మరికొన్ని గంటల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఈ మాసంలో ఇప్పటి వరకు వరలక్ష్మీ వ్రతం ఆచరించని భక్తులు ఈ శుక్రవారం పూజ చేసుకో వచ్చని పెద్దలు చెబుతారు. అయితే ఈ మాసంలో ఆఖరి శుక్రవారం వరలక్ష్మీ వ్రతం ఆచరిస్తే.. ఇంటిలోని సమస్యలతోపాటు ఆర్థిక ఇబ్బందులు సైతం తొలిగిపోతాయని అంటారు. అదీకాక శ్రావణ మాసంలో ఆఖరి శుక్రవారం పూజలు చేయడం వల్ల అమ్మ అనుగ్రహం కలుగుతోందని చెబుతారు.
ఈ రోజున అమ్మవారిని పూజించడం వల్ల సంపదలు పెరుగుతాయి. అంతేకాకుండా జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయి. కుటుంబ శ్రేయస్సు కోసం.. ఇంట్లోని మహిళలు ఈ రోజు ఉపవాసాన్ని ఆచరిస్తారు. ఈ ఏడాది ఆగస్టు 22వ తేదీ ఆఖరి శుక్రవారం వచ్చింది. ఈ రోజు అమ్మవారిని పూజించడం వల్ల కుటుంబ శ్రేయస్సు వృద్ధి చెందుతుంది. ఇంకా సొదాహరణగా చెప్పాలంటే.. మహిళలు ఉపవాసం పాటించాలి.
వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించడం వల్ల సంతోషం, శ్రేయస్సు కలుగుతాయి. ఈ రోజున లక్ష్మీ దేవిని పూజించడం వల్ల శుభాలతోపాటు సంపదలు సమకూరుతాయి. అమ్మ వారి వద్ద ఆవు నెయ్యి దీపం వెలిగించి.. ఓం శ్రీ హ్రీం శ్రీనమ: అనే మంత్రాన్ని జపించడం వల్ల అమ్మ వారి అనుగ్రహం శీఘ్రగతిన కలుగుతోందంటారు.
అమ్మవారిని పూజించేటప్పుడు 11 పసుపు పిండి ముద్దలు.. లక్మీదేవి పాదాలకు సమర్పించాలి. ఈ పూజ అనంతరం వాటిని ఎర్రని గుడ్డలో కట్టి బీరువాలో ఉంచాలి. దీని వల్ల ఆర్థిక లబ్ధి పొందే అవకాశం ఉంది. ఈ పూజ అనంతరం లక్ష్మీదేవికి కొబ్బరికాయ సమర్పించాలి. దీని వల్ల ఆర్థిక లబ్ది పొందే అవకాశం ఏర్పడుతుంది. లక్ష్మీదేవితోపాటు విష్ణుమూర్తిని సైతం పూజించాలి. ఈ పూజ సమయంలో బెల్లంతో చేసిన ఖీర్ నైవేద్యంగా అమ్మవారికి సమర్పించాలి.
ఈ వార్తలు కూడా చదవండి..
300 ఏళ్ల తర్వాత అరుదైన రాజయోగం.. ఈ రాశుల వారికి జాక్ పాటే..
శ్రీ సత్య సాయి శతజయంతి ఉత్సవాల ప్రారంభానికి రంగం సిద్ధం
మరిన్ని ఆధ్యాత్మిక వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Aug 21 , 2025 | 09:06 AM