Karthika Pournami: ఈ వస్తువులను దానం చేస్తే.. అమ్మవారి అనుగ్రహం..
ABN, Publish Date - Nov 02 , 2025 | 04:19 PM
కార్తీక మాసం అంటేనే పవిత్రం. ఈ మాసంలో వచ్చే పౌర్ణమి అత్యంత పవిత్రం. ఈ రోజు చేసే దాన ధర్మాల వల్ల మంచి జరుగుతుందంటారు.
కార్తీక పౌర్ణమి వేళ శ్రీమహాలక్ష్మీని పూజించడం వల్ల అమ్మ వారి అనుగ్రహం కలుగుతుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఈ ఏడాది నవంబర్ 05వ తేదీ.. బుధవారం కార్తీక పౌర్ణమి వచ్చింది. ఈ రోజు కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల సిరి సంపదలు వస్తాయని పండితులు చెబుతారు. మరి ముఖ్యంగా తెల్లని వస్తువులు దానం చేయాలని వారు వివరిస్తున్నారు. అంటే.. ఈ పౌర్ణమి రోజు పాలు, పెరుగు, నెయ్యి, బియ్యం, పంచదార తదితర తెల్లని వస్తువులను దానం చేయాలంటారు. ఇలా చేయడం వల్ల మహాలక్ష్మీ సంతోషిస్తుందంటారు.
వస్త్రదానం..
ఈ రోజు వస్త్ర దానం చేయడం వల్ల ఇంట్లో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సమాజంలో గౌరవం సైతం పెరుగుతుంది. అంటే ఇంట్లో సంపదతోపాటు సమాజంలో శ్రేయస్సు వస్తుంది.
ధాన్యం..
ఈ రోజు ఆహార ధాన్యాలు దానం చేయడం శుభప్రదమని పవిత్ర గ్రంధాలు సైతం చెబుతున్నాయి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఆహారం కొరత ఉండదు. కుటుంబ గౌరవం సైతం పెరుగుతుంది. అలాగే సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరిగి.. ఆత్మ సంతృప్తి కలుగుతుంది.
బెల్లం..
ఈ రోజు బెల్లం దానం చేయడం వల్ల శ్రీమహా విష్ణువు సంతోషిస్తారు. దీనిని దానం చేయడం వల్ల ఇంట్లో పేదరికం తొలిగిపోయి.. శ్రీమహాలక్ష్మీ అనుగ్రహంతోపాటు ఐశ్వర్యం కలుగుతుంది.
పండ్లు..
ఈ రోజు పండ్లు దానం చేస్తే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. సాక్షాత్తు దేవతల నుంచి ఆశీర్వాదం అందుకుంటారు. కార్తీక పౌర్ణమి.. పరమ పవిత్రమైన రోజు. ఈ రోజు చాలా మంది నోములు నోచుకుంటారు. అలాంటి వారికి ఇలా పండ్లు దానం చేస్తే.. ఫలితం శీఘ్రంగా అందుతుంది.
అలంకరణ సామాగ్రి..
ఈ రోజు మహిళలకు అలంకరణ సామాగ్రిని దానం చేస్తే.. శ్రీమహాలక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది. అంతేకాదు.. భర్త, పిల్లలు సైతం దీర్ఘాయుష్షును పొందుతారు. ఈ కార్తీక పౌర్ణమి రోజు చేసే దానం వల్ల అమ్మవారి సంతోషిస్తుందని పండితులు పేర్కొంటారు. ఇలా చేయడం వల్ల జీవితంలో కీర్తి ప్రతిష్టలు, ఆర్థిక స్థిరత్వం లభిస్తుందంటారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఇంతకీ కార్తీక పౌర్ణమి ఎప్పుడు? ఆ రోజు ఏం చేయాలి.. ?
నవంబర్ మూడో వారం చివరి నుంచి ఈ రాశులకు అదృష్ట యోగం
For More Devotional News And Telugu News
Updated Date - Nov 02 , 2025 | 04:58 PM