ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Karthika Pournami: కార్తీక పౌర్ణమి.. 365 వత్తులతో దీపారాధన.. ఎందుకు వెలిగిస్తారంటే?

ABN, Publish Date - Nov 04 , 2025 | 03:25 PM

ఈ ఏడాది కార్తీక పౌర్ణమి బుధవారం వచ్చింది. ఈ కార్తీక పౌర్ణమిని మహా శివరాత్రితో పోలుస్తారు. అంతటి పవిత్రమైన ఈ రోజు.. దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతాయి.

ఏడాదిలో పవిత్రమైన మాసాలు చాలానే ఉన్నాయి. అయితే కార్తీక మాసం అత్యంత పవిత్రమైనది. ఈ మాసంలో అన్ని రోజులు పవిత్రమైనవే. ఈ మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి.. మహాశివరాత్రితో సమానమైన రోజని పండితులు చెబుతారు. ఈ పౌర్ణమి.. శివకేశవులు ఇద్దరికి అత్యంత ప్రీతికరమైన రోజని అంటారు. అలాంటి ఈ కార్తీక పౌర్ణమి వేళ.. భక్తులంతా 365 వత్తులతో శివాలయంలో దీపారాధన చేస్తారు. ఇలా దీపం వెలిగించడం వల్ల పుణ్యం లభిస్తుందంటారు. అంటే ఏడాదికి 365 రోజులు. ఒక్కోరోజుకు ఒక్కో వత్తిగా పరిగణిస్తారు. ఈ దీపాలను అరటి దోసలో పెట్టి నదులు, దేవాలయాల్లోని కోనేటిలలో వదులుతారు.

ఈ పౌర్ణమి రోజు దీపం వెలిగిస్తే.. అశ్వమేధయాగం చేసినంత ఫలితం లభిస్తుందంటారు. ఈ 365 వత్తులను ఇంటి ముందు తులసికోట వద్ద వెలిగిస్తే.. సర్వదోషాలు తొలగిపోతాయని చెబుతారు. ఈ కార్తీక పౌర్ణమి రోజు.. మృత్యుంజయ మంత్రాన్ని పఠించాలని భక్తులకు పండితులు సూచిస్తున్నారు. అది కూడా 108 సార్లు పఠించాలని స్పష్టం చేస్తున్నారు. అలా చేయడం వల్ల రోగాలు దరి చేరవని పేర్కొంటారు. వివాహమైన యువతులు ఇలా దీపాలు వెలిగించడం వల్ల వారి కుటుంబానికి మంగళకరమని విశ్వసిస్తారు.

జ్వాలాతోరణం: కార్తీక పౌర్ణమి రోజు శివాలయాల్లో జ్వాలాతోరణం వెలిగిస్తారు. ఈ తోరణం కింద నుంచి వెళ్లడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని భక్తులు నమ్ముతారు. పాల సముద్రంలో పుట్టిన విషాన్ని పరమేశ్వరుడు మింగిన తర్వాత వేడిని తట్టుకోలేక పోతాడు. ఆ వేడిని తగ్గించమంటూ అగ్ని దేవుడిని పార్వతీ దేవి వేడుకుంటుంది. దాంతో తన సహజ స్వభావాన్ని అగ్ని కొంత మేర తగ్గిస్తాడు. అందుకు అగ్నికి పార్వతి దేవి కృతజ్ఞతలు తెలుపుతుంది. అందులో భాగంగా కార్తీక పౌర్ణమి రోజు పార్వతి దేవి జ్వాలా తోరణం కడుతుంది. ఆ తోరణం కింద నుంచి భార్యాభర్తలిద్దరు వెళ్లారు.

నాటి నుంచి కార్తీక పౌర్ణమి రోజు.. శివాలయాల్లో జ్వాలాతోరణాలు ఏర్పాటు చేయడం అనవాయితీగా మారింది. ఈ రోజు శివాలయాల్లో జ్వాలాతోరణం చూసిన వారికి మరో జన్మ ఉండదని భక్తులు విశ్వసిస్తారు. జ్వాలా తోరణం కాల్చిన తర్వాత మిగిలిన బూడిదను నుదుటిన పెట్టుకుంటే భూత, ప్రేత, పిశాచాల పీడ ఉండదని చెబుతారు.

పౌర్ణమి రోజు చంద్రుడు నిండుగా కాంతివంతంగా కనిపిస్తాడు. ఇక ఈ కార్తీక పౌర్ణమి రోజు చంద్రుడి కిరణాలు శరీరం మీద పడితే నరాలు, కళ్లకు సంబంధించిన సమస్యలు దూరమవుతాయని పెద్దలు చెబుతారు. ఏడాదిలో మిగిలిన పౌర్ణమిల కంటే.. చంద్రుడు మరింత కాంతివంతంగా ఉంటాడు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఐదు నిమిషాల పాటు చంద్రుడి కాంతి శరీరంపై పడేలా భక్తులు చూసుకోవాలని పండితులు సూచిస్తున్నారు.

ఈ కార్తీక పౌర్ణమి రోజంతా ఉపవాసం చేసి.. సాయంత్రం దీపారాధన చేస్తారు. ఈ సందర్భంగా దైవానికి చలిమిడిని ప్రసాదంగా పెడతారు. ఈ చలిమిడి స్త్రీలలోని గర్భాశయానికి సంబంధించిన సమస్యలను తగ్గిస్తుందంటారు.

పౌర్ణమి రోజుల్లో అమ్మ వారి దేవాలయాలు కిటకటిలాడుతాయి. అయితే కార్తీక పౌర్ణమి రోజుల్లో అమ్మవారి ఆలయాలతోపాటు శివాలయాలు, వైష్ణవాలయాలు భక్తులతో నిండిపోతాయి. తెల్లవారుజామునే నదీ, సముద్ర స్నానాలు ఆచరించి.. భక్తులు దేవాలయానికి చేరుకుంటారు. భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు. ఇక సాయంత్రం వేళల్లో దేవాలయాల్లో 365 వత్తులతో దీపారాధన చేస్తారు.

అనంతరం ఇంటికి చేరుకుని భోజనం చేస్తారు. అయితే ఈ కార్తీక పౌర్ణమి రోజు.. కార్తీక పురాణాన్ని భక్తులు పారాయణం చేస్తారు. మరికొందరు ఈ రోజు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకుంటారు. కార్తీక నోములు సైతం ఆచరిస్తారు.

ఈ వార్తలు కూడా చదవండి..

కార్తీక పౌర్ణమి నుంచి ఈ రాశులకు గజకేసరి యోగం..

ఈ వస్తువులను దానం చేస్తే.. అమ్మవారి అనుగ్రహం..

For More Devotional News And Telugu News

Updated Date - Nov 04 , 2025 | 03:55 PM