ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Karthika Masam: కార్తీక మాసం.. ఆఖరి సోమవారం.. ఇలా చేస్తే..

ABN, Publish Date - Nov 13 , 2025 | 03:30 PM

కార్తీక మాసం మరికొద్ది రోజుల్లో ముగియనుంది. ఆఖరి సోమవారం ఇలా చేయడం వల్ల ఆ పరమ శివుని అనుగ్రహం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.

అత్యంత పవిత్రమైన మాసాల్లో ఒకటి.. కార్తీక మాసం. ఈ మాసం మరికొద్ది రోజుల్లో ముగియనుంది. అంటే.. నవంబర్ 20వ తేదీ అమావాస్యతో ఈ మాసం ముగుస్తుంది. ఈ నేపథ్యంలో నవంబర్ 17వ తేదీ ఆఖరి కార్తీక సోమవారం వస్తుంది. ఈ మాసంలో గత కార్తీక సోమవారాలు లేదా పౌర్ణమి వేళ.. 365 వత్తులు వెలిగించకపోవడం.. సోమవారాలు ఉపవాసం ఉండని.. వారు.. చివరి సోమవారం చేసుకోవచ్చని పండితులు చెబుతున్నారు.

అదీకాక ఈ మాసంలో చివరి సోమవారానికి మరింత ప్రత్యేకతతోపాటు ప్రాధాన్యత ఉందని వారు అంటున్నారు. చివరి కార్తీక సోమవారం రోజు.. ఇలా చేస్తే.. కోటి సోమవారాలు చేసినంత ఫలితం దక్కుతుందని పేర్కొంటున్నారు. ఏం చేయాలంటే.. ఈ రోజు తెల్లవారుజామునే నిద్ర లేచి.. నది లేదా సముద్ర స్నానం ఆచరించాలి. అది సాధ్యం కాకుంటే.. ఇంటి వద్దే గంగా జలం లేదా పవిత్ర నదీ జలాన్ని స్నానం చేసే నీటిలో కొద్దిగా కలుపుకొని తలంటు స్నానం చేసి.. శుభ్రమైన దుస్తులు ధరించాలి.

పరమ శివుని చిత్ర పటం ముందు ఆవు నెయ్యితో దీపారాధన చేసి.. దణ్ణం పెట్టుకోవాలి. ఈ సందర్భంగా స్వామి వారికి నైవేద్యంగా పండ్లు సమర్పించాలి. ఈ రోజు ఉపవాసం ఉండాలి. ఆ క్రమంలో పాలు, పండ్లు, అల్పాహారంగా తీసుకోవచ్చు. శివాలయంలో శివునికి అభిషేకం చేయించిన మంచిది.

అలాగే సూర్యాస్తమయం తర్వాత వచ్చే ప్రదోష కాలం.. శివారాధనకు అత్యంత ముఖ్యమైనది. ఈ సమయంలో సైతం ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. అనంతరం శివాలయానికి వెళ్లి.. స్వామి వారిని దర్శించుకుని.. ఆలయ ప్రాంగణంలో దీపారాధన చేయాలి.

ఆ క్రమంలో 365 వత్తులతో దీపాన్ని వెలిగించడం.. పేదవారికి దానధర్మాలు చేయడం వల్ల ఏడాది పొడవునా వ్రత ఫలితం దక్కుతుందని చెబుతారు. పరమ శివుడిని భక్తితో పూజించి.. ప్రార్థించడం వల్ల వైవాహిక జీవితంలో ఏమైనా సమస్యలు తొలగిపోతాయి. సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుందని చెబుతారు. ఈ మాసంలో చివరి సోమవారం నిష్టగా ఉపవాసం ఉండి.. ఆ నీలకంఠేశ్వరుడ్ని భక్తితో ఆరాధించిన వారికి మోక్షం సైతం లభించడంతోపాటు జన్మరాహిత్యాన్ని కూడా పొందుతారని పురాణాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ రోజు వ్రతం ఆచరించడం వల్ల అనారోగ్య సమస్యలు తొలగి.. ఐశ్వర్యం, సౌభాగ్యం కలుగుతాయని పండితులు పేర్కొంటున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

 కార్తీక మాసంలోనే వన భోజనాలు ఎందుకు చేస్తారో తెలుసా?

కార్తీక మాసంలో దీపాలు పెట్టడం వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

For More Devotional News And Telugu News

Updated Date - Nov 13 , 2025 | 03:49 PM