ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఆ రాశి వారికి ఈ వారం రావాల్సిన ధనం అందుతుంది..

ABN, Publish Date - Oct 12 , 2025 | 07:36 AM

ఆ రాశి వారికి ఈ వారం రావాల్సిన ధనం అందుతుందని ప్రముఖ జ్యోతిష్య పండితులు తెలుపుతున్నారు. అలాగే.. శుభసమయం సమీపిస్తోందని, అయితే.. కొత్త సమస్యలు ఎదురయ్యే సూచనలున్నాయని తెలుపుతున్నారు. ఇక.. కొన్ని విషయాలలో చాలా జాగ్రత్తగా ఉంటే మంచిదని సూచిస్తున్నారు. మొత్తంగా.. ఈ వారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

అనుగ్రహం12 -18 అక్టోబర్‌ 2025

పి.ప్రసూనా రామన్‌

మేషం

అశ్విని, భరణి,

కృత్తిక 1వ పాదం

ఆర్థికంగా విశేష ఫలితాలున్నాయి. స్వయంకృషితో అనుకున్నది సాధిస్తారు. ఆశలొదిలేసుకున్న ధనం అందుతుంది. అవసరాలు నెరవేరుతాయి. సన్నిహితులతో తరచుగా సంభాషిస్తారు. చేపట్టిన పనులు సాగవు. సామరస్యంగా మెలగండి. చిన్న విషయాన్ని పెద్దది చేసుకోవద్దు. ఆహ్వానం అందుకుంటారు. పత్రాల్లో మార్పులు సాధ్య పడతాయి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది.

వృషభం

కృత్తిక 2,3,4; రోహిణి,

మృగశిర 1,2 పాదాలు

కార్యసాధనకు మరింత శ్రమించాలి. యత్నాలు కొనసాగించండి. మీ సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేసుకోవద్దు. ఆప్తులు సాయం అందిస్తారు. చేస్తున్న పను లపై దృష్టిపెట్టండి. మీ ఏమరుపాటుతనం ఇబ్బంది కలిగిస్తుంది. ఖర్చులు అదుపులో ఉండవు. చెల్లింపుల్లో అలక్ష్యం తగదు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. చేసిన పనులే చేయవలసి వస్తుంది. ఆత్మీయులను సంప్రదిస్తారు. శుభకార్యానికి హాజరవుతారు.

మిథునం

మృగశిర 3,4; ఆర్ద్ర,

పునర్వసు 1,2,3 పాదాలు

రుణసమస్య పరిష్కారమవు తుంది. మానసికంగా కుదుటపడతారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. చిన్న విషయానికే చికాకుపడతారు. ఖర్చులు అధికం. ఇంటి విషయాలపై దృష్టిపెడతారు. కొన్ని అవకా శాలు అనుకోకుండా కలిసివస్తాయి. ప్రము ఖులకు సన్నిహితులవుతారు. వ్యతిరేకులతో జాగ్రత్త. ఫోన్‌ సందేశాలు పట్టించుకోవద్దు. పత్రాల్లో సవరణలు సాధ్యపడతాయి.

కర్కాటకం

పునర్వసు 4వ

పాదం, పుష్యమి, ఆశ్లేష

సంకల్పబలంతో చేసే యత్నం ఫలిస్తుంది. మిమ్ములను మీరు తక్కువ అంచనా వేసుకోవద్దు. కొందరి వ్యాఖ్యలు నీరుగారు స్తాయి. ఆశావహదృక్పధంతో ముందుకు సాగండి. సాయం ఆశించవద్దు. ముఖ్యుల కలయిక వీలుపడదు. దూరపు బంధువుల ఆహ్వానం అందుకుంటారు. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. స్థిరచరాస్తుల వ్యవహారంలో జాగ్రత్త. మధ్యవర్తులను ఆశ్రయించవద్దు.

సింహం

మఖ, పుబ్బ,

ఉత్తర 1వ పాదం

శుభఫలితాలు గోచరిస్తు న్నాయి. తలపెట్టిన కార్యం నెరవేరుతుంది. స్నేహసంబంధాలు అధికమవుతాయి. అవకాశాలను చేజిక్కించుకుంటారు. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. బాధ్యతలు అప్పగించ వద్దు. అనవసర జోక్యం ఇబ్బంది కలిగిస్తుంది. ఊహించిన ఖర్చులే ఉంటాయి. పెట్టుబడుల పై దృష్టి పెడతారు. ప్రైవేట్‌ ఫైనాన్సుల జోలి కి పోవద్దు. నిపుణులతో సంప్రదింపులు జరు పుతారు. ఒక సమాచారం ఉల్లాసాన్నిస్తుంది.

కన్య

ఉత్తర 2,3,4; హస్త,

చిత్త 1,2 పాదాలు

యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. పెద్దల ఆశీస్సులు అందుకుం టారు. కష్టమనుకున్న పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. మీ చొరవతో శుభకార్యం నిశ్చయమవుతుంది. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చుచేస్తారు. నగదు డ్రా చేసేటపుడుజాగ్రత్త. పిల్లల అత్యుత్సాహం అదుపు చేయండి. అనవసర విషయాల జోలికి పోవద్దు.

తుల

చిత్త 3,4; స్వాతి,

విశాఖ 1,2,3 పాదాలు

కార్యసాధనలో సఫలీకృతుల వుతారు. మీపై వచ్చిన అభియోగాలు తొలగిపోగలవు. కొత్తయత్నాలు మొదలు పెడతారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడ తాయి. ఆచితూచి అడుగు వేయండి. కొన్ని విషయాలు పటించుకోవద్దు. అర్థాంతరంగా ముగించిన పనులు పూర్తిచేస్తారు. రావలసిన ధనం అందుతుంది. బంధువులు ధన సహాయం అర్థిస్తారు. కొంతమొత్తం సాయం చేయండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.

వృశ్చికం

విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ

రావలసిన ధనం అందుతుంది. కొంతమొత్తం పొదుపు చేస్తారు. అనురాగ వాత్సల్యాలు వెల్లివిరుస్తాయి. వాక్పటిమతో నెట్టుకొస్తారు. చేసిన పనులే చేయవలసి వస్తుంది. చిన్న విషయాన్ని పెద్దది చేసుకో వద్దు. గృహమరమ్మతులు చేపడతారు. విలు వైన వస్తువులు జాగ్రత్త. ఆత్మీయుల రాక ఉపశమనం కలిగిస్తుంది. మీ సాయంతో ఒక రికి మంచి జరుగుతుంది. బంధువుల ఆతిథ్యం ఆకట్టుకుంటుంది.

ధనుస్సు

మూల, పూర్వాషాఢ,

ఉత్తరాషాఢ 1వ పాదం

గ్రహస్థితి బాగుంది. సర్వత్రా అనుకూలం. వ్యవహారాలను సమర్థంగా నిర్వహిస్తారు. తలపెట్టిన కార్యం నిర్విఘ్నంగా సాగుతుంది. పెద్దమొత్తం ధనసహాయం తగదు. అందరితోనూ మితంగా సంభాషించండి. ఒకరి వద్ద మరొకరి ప్రస్తావన తగదు. ఆగిపో యిన పనులు ఎట్టికేలకు పూర్తవుతాయి. వివాహ యత్నం ఫలించే సూచనలున్నాయి. మీ ఇష్టాయిష్టాలను కచ్చితంగా తెలియజేయండి.

మకరం

ఉత్తరాషాఢ 2,3,4;

శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు

కార్యసిద్థికి ఓర్పు ప్రధానం. చేస్తున్న పనులపై దృష్టిపెట్టండి. ఒత్తిడికి గురికావద్దు. మీ యత్నాలను సన్నిహితులు ప్రోత్సహిస్తారు. ఆశలొదిలేసుకున్న ధనం అందుతుంది. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. చెల్లింపుల్లో జాప్యం తగదు. ఆచితూచిఅడుగు వేయండి. నోటీసులు అందుకుంటారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. మీ సమ స్యలను సన్నిహితులకు తెలియజేయండి. ఫోన్‌ సందేశాలు పట్టించుకోవద్దు.

కుంభం

ధనిష్ట 3,4; శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు

వ్యవహరాల్లో తొందరపాటు తగదు. నిపుణులను సంప్రదించండి. పనులు హడావుడిగా సాగుతాయి. ధనసహాయం తగదు. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. మీ సమర్థతకు నిదా నంగాగుర్తింపు లభిస్తుంది. ఒక సంబంధం కలిసివస్తుంది. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు.

మీనం

పూర్వాభాద్ర 4వ

పాదం, ఉత్తరాభాద్ర, రేవతి

శుభసమయం సమీపిస్తోంది. ఉత్సాహంగా యత్నాలు సాగించండి. లక్ష్యానికి చేరువవు తారు. పనుల సానుకూలతకులౌక్యం, కృషి ప్రధానం. ఖర్చులు తగ్గించుకుంటారు. కొత్త సమస్యలు ఎదురయ్యే సూచనలున్నాయి, అందరితోనూ మితంగా సంభాషించండి. అనవసర జోక్యం తగదు. ఆహ్వానం అందు కుంటారు. తెగిపోయిన బంధుత్వాలు బలపడ తాయి. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు ముందుకు సాగవు.

ఈ వార్తలు కూడా చదవండి..

పసిడి ధరలకు రెక్కలు.. నేటి ధరలు చూస్తే..

విమానంలో పగిలిన అద్దం.. 76 మందికి తప్పిన ముప్పు

Read Latest Telangana News and National News

Updated Date - Oct 12 , 2025 | 07:36 AM