Gold Rate on Oct 12: పసిడి ధరలకు రెక్కలు.. నేటి ధరలు చూస్తే..
ABN , Publish Date - Oct 12 , 2025 | 06:31 AM
చైనాపై ట్రంప్ భారీ సుంకాలు విధించడంతో బంగారం ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. మరి దేశంలో ప్రస్తుతం బంగారం వెండి, ధరలు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఇంటర్నెట్ డెస్క్: దేశంలో బంగారం ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి. కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేడు 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,25,080కు చేరుకుంది. 22 క్యారెట్ 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,14,650కి చేరింది. ఇక 18 క్యారెట్ పది గ్రాముల బంగారం కూడా 93,810కి చేరుకుంది. ఇక కిలో వెండి ధర రూ.1,80,000కు చేరుకుంది. 10 గ్రాముల ప్లాటినం ధర రూ.45,420గా ఉంది (Gold Rates on 12-10-2025).
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై భారీగా సుంకాలు విధించడంతో బంగారం ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. చైనాపై 100 శాతం సుంకాల విధింపు, కీలక సాఫ్ట్‌వేర్ ఎగుమతులపై ఆంక్షలు వంటివి గ్లోబల్ మార్కెట్స్‌కు షాకిచ్చాయి. ఫలితంగా మదపర్లు సురక్షిత పెట్టుబడి సాధనమైన బంగారం వైపు మళ్లడంతో ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. భారత్‌పై కూడా ఈ ప్రభావం పడటంతో బంగారం ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి.
వివిధ నగరాల్లోని బంగారం ధరలు ఇవీ..
చెన్నై: ₹1,25,460; ₹1,15,000; ₹95,000
ముంబై: ₹1,25,080; ₹1,14,650; ₹93,810
ఢిల్లీ: ₹1,25,230; ₹1,14,800; ₹93,960
కోల్‌కతా: ₹1,25,080; ₹1,14,650; ₹93,810
బెంగళూరు: ₹1,25,080; ₹1,14,650; ₹93,810
హైదరాబాద్: ₹1,25,080; ₹1,14,650; ₹93,810
కేరళ: ₹1,25,080; ₹1,14,650; ₹93,810
పూణె: ₹1,25,080; ₹1,14,650; ₹93,810
వడోదర: ₹1,25,130; ₹1,14,700; ₹93,860
అహ్మదాబాద్: ₹1,25,130; ₹1,14,700; ₹93,860
వివిధ నగరాల్లో వెండి ధరలు ఇవీ
చెన్నై: ₹1,90,000
ముంబై: ₹1,80,000
ఢిల్లీ: ₹1,80,000
కొలకతా: ₹1,80,000
బెంగళూరు: ₹1,82,300
హైదరాబాద్: ₹1,90,000
కేరళ: ₹1,90,000
పుణే: ₹1,80,000
వడోదరా: ₹1,80,000
అహ్మదాబాద్: ₹1,80,000
ఇవీ చదవండి:
టీసీఎస్‌లో ఉద్యోగుల తొలగింపులు.. ఈ త్రైమాసికంలో ఏకంగా..
రాంగ్ నంబర్‌కు యూపీఐ పేమెంట్ చేశారా.. ఇలా రిఫండ్ పొందండి..!
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి