ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

2026 Horoscope: వచ్చే ఏడాది ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమేనట..!

ABN, Publish Date - Dec 25 , 2025 | 09:57 PM

వచ్చే ఏడాది జనవరిలో ధనుస్సు రాశిలో లక్ష్మీ-నారాయణ యోగం ఏర్పడుతోంది. ఈ యోగం 12 రాశి చక్రాలపై ప్రభావం చూపనుంది. ఫలితంగా ఆయా రాశుల వారి జీవితంలో అనుకోని మార్పులు చోటు చేసుకోబోతున్నాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. మరి ఆ వివరాలేంటో ఓసారి చూద్దాం..

2026 Horoscope

మరికొద్ది రోజుల్లో నూతన సంవత్సరం ప్రారంభం కానుంది. అయితే, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. రానున్న కొత్త సంవత్సరంలో ఆయా రాశుల వారి జీవితాలు ఊహించని రీతిలో మారిపోతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. పండితులు తెలిపిన వివరాల ప్రకారం.. డిసెంబర్ 29వ తేదీన బుధుడు - శుక్రుడు కారణంగా ‘లక్ష్మీ-నారాయణ యోగం’ ఏర్పడనుంది. ఈ అరుదైన రాజయోగం కారణంగా రానున్న సంవత్సరం అంతా ఆయా రాశుల జీవితం అద్భుతంగా ఉండబోతోంది. తెలివితేటకు కారకుడైన బుధుడు, సంపదలకు కారకుడైన శుక్రుడు ధనుస్సు రాశిలో ప్రవేశించనున్నాయి. ఈ శక్తివంతమైన కలయిక కారణంగా ‘లక్ష్మీ నారాయణ యోగం’ ఏర్పడనుంది. ఈ రాజయోగం ప్రభావంతో జనవరి నెలలో అనేక రాశుల వారి ఆర్థిక పరిస్థితి ఊహించని రీతిలో మెరుగుపడనుంది. అలాగే వారి కెరీర్‌లో మంచి పురోగతి సాధిస్తారని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. మరి ఈ లక్ష్మీ నారాయణ యోగం వల్ల ఏయే రాశుల వారికి మేలు జరుగనుందో ఇప్పుడు తెలుసుకుందాం..

  • మేషం: ఈ రాశి వారు రానున్న రోజుల్లో ఆర్థిక స్థిరత్వాన్ని పొందుతారు. కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడానికి ఇది సరైన సమయం.

  • వృషభ రాశి: ఈ రాశి వారికి కూడా ఆర్థిక పరంగా చాలా వృద్ధి చెందే అవకాశం ఉంది. పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. అన్నీ కలిసొచ్చే అవకాశం ఉంది.

  • మిథున రాశి: ఈ రాశి వారికి వచ్చే సంవత్సరం అంతా శుభదాయకంగా ఉంటుంది. కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. అయితే, ఆర్థిక విషయాల్లో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.

  • కర్కాటక రాశి: ఈ రాశి వారికి కూడా రానున్న కాలం అంతా మంచి జరుగనుంది. మంచి మంచి అవకాశాలు రానున్నాయి. తల్లిదండ్రుల ఆశీస్సులు మరింత బలం చేకూర్చనున్నాయి. ఆస్తి లాభ సూచనలు కనిపిస్తున్నాయి.

  • సింహ రాశి: ఈ రాశి వారు అపారమైన సంపద పొందే అవకాశం ఉంది. ఆర్థికంగా మరింత బలపడనున్నారు.

  • కన్య రాశి: వృత్తిపరమైన వ్యాపారాలలో పురోగతి సాధించనున్నారు. పెట్టుబడులు కలిసివస్తాయి. ఆర్థిక వృద్ధి సాధిస్తారు.

  • తులారాశి: ఈ రాశివారు మహిళా మార్గదర్శకుల ద్వారా అద్భుతమైన విజయాన్ని సాధిస్తారు. చేపట్టిన కార్యక్రమాలు విజయవంతం అవుతాయి.

  • వృశ్చిక రాశి: ఈ రాశి వారికి వచ్చే ఏడాది అంతా శుభదాయకంగా ఉండనుంది. కుటుంబ పరంగా ప్రశాంతమైన జీవితాన్ని ఆస్వాదించనున్నారు. ఆరోగ్యంగా ఉంటారు.

  • ధనుస్సు రాశి: లక్ష్మీ నారాయణ యోగం కారణంగా ఈ రాశి వారికి అనేక రకాలుగా మేలు జరుగనుంది. ధన లబ్ధి పొందనున్నారు.

  • మకర రాశి: ఈ రాశి వారికి కూడా అంతా శుభంగా ఉంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ దక్కే అవకాశం ఉంది.

  • కుంభ రాశి: ఈ రాశి వారి కీర్తి ప్రతిష్ఠలు పెరగనున్నాయి. ఆర్థికంగా వృద్ధి సాధిస్తారు.

  • మీన రాశి: ప్రేమ వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. విదేశీ ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ఆర్థికంగానూ వృద్ధి సాధిస్తారు.

గమనిక: పైన పేర్కొన్న సమాచారం జ్యోతిష్య శాస్త్ర నిపుణులు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఇవ్వడం జరిగింది. ఇది నమ్మడం మీ వ్యక్తిగత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. దీనిని ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు.

Also Read:

బిర్యానీ క్రేజ్.. స్విగ్గీలో నిమిషానికి 200 ఆర్డర్లు !

రుచికరమైన టమాటా కొబ్బరి చట్నీ.. ఇలా చేస్తే టేస్ట్ అదిరిపోతుంది!

మీ ట్యాలెంట్‌ను పరీక్షించుకోండి.. ఈ ఫొటోల్లోని మూడు తేడాలను 59 సెకెన్లలో కనిపెట్టండి

Updated Date - Dec 25 , 2025 | 09:57 PM