Solar Eclipse: మళ్లీ గ్రహణం.. ఈ రాశుల వారికి జాక్‌పాట్
ABN, Publish Date - Sep 16 , 2025 | 08:09 AM
ఈ ఏడాది మహాలయ పక్షాలు చంద్ర గ్రహణంతో ప్రారంభమైనాయి. మళ్లీ ఈ పక్షాలు సూర్య గ్రహణంతో ముగియనున్నాయి.
హైదరాబాద్, సెప్టెంబర్ 16: ఈ మాసంలో పక్షం రోజుల తేడాతో మళ్లీ గ్రహణం ఏర్పడనుంది. సెప్టెంబర్ 21వ తేదీ పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడనుంది. మహాలయ పక్ష అమావాస్య రోజున సంభవించే ఈ సూర్య గ్రహణం భారత్‌లో మాత్రం కనిపించదు. ఇది ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అంటార్కిటికా, అట్లాంటిక్, పసిఫిక్ మహాసముద్ర ప్రాంతాల్లోనే కనిపిస్తోంది. ఈ పాక్షిక గ్రహణం భారత్‌లో రాత్రి 10.59 గంటలు నుంచి తెల్లవారుజామున 3.23 గంటల వరకు ఉంటుంది. యోగులు, ఆధ్యాత్మిక సాధకులకు ఈ గ్రహణ కాలం అద్భుతమైన అవకాశమని పండితులు చెబుతున్నారు. ఆ సమయంలో చేసే జపాలు, తపాలు, ధ్యానం, దానాలు విశేష ఫలితాలు ఇస్తాయని పేర్కొంటున్నారు.
అయితే సెప్టెంబర్ 21వ తేదీన ఏర్పడే సూర్య గ్రహణం సింహరాశిలో సంభవిస్తుంది. అందువల్ల ఈ రాశి వారు గ్రహణం చూడకూడదు. ఇక ఈ గ్రహణం సముద్ర ప్రాంతాల్లో ఏర్పడనుంది. దీంతో సముద్రంలో అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తీర ప్రాంతాల్లో ప్రజలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వారు సూచిస్తున్నారు.
ఈ ఏడాది సెప్టెంబర్ 7వ తేదీ నుంచి మహాలయ పక్షాలు ప్రారంభమైనాయి. ఆ రోజు సైతం చంద్రగ్రహణం ఏర్పడింది. ఈ సంగతి అందరికి తెలిసిందే. అంటే ఈ మహాలయ పక్షాలు.. చంద్రగ్రహణంతో ప్రారంభమైంది. మళ్లీ సూర్య గ్రహణంతో ఈ పక్షాలు ముగియనున్నట్లు అవుతుంది. ఈ సూర్య గ్రహణం అన్ని రాశులపై ప్రభావం చూపనుందని పండితులు చెబుతున్నారు.
మరి ముఖ్యంగా కొన్ని రాశుల వారికి ఈ గ్రహణం అదృష్టయోగాన్ని తీసుకు వస్తుందని వివరిస్తున్నారు.
సింహరాశి: ఈ రాశి వారికి సూర్యగ్రహణం వల్ల అదృష్టం కలిసి వస్తుంది. వీరి సంపద రెట్టింపు అయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఊహించని స్థాయిలో డబ్బులు సంపాదిస్తారు. ఆర్థికంగా బాగా కలిసి వస్తోంది. అలాగే ఏ పని చేసినా కలిసి వస్తుంది.
కుంభరాశి: ఈ రాశి వారికి చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా బాగుంటుంది. ఉద్యోగంలోని వారికి పేరు ప్రఖ్యాతలు వస్తాయి. ఆకస్మిక ధన లాభం సూచితం. నిరుద్యోగులకు సైతం ఉద్యోగం వస్తుంది. చాలా ఆనందంగా గడుపుతారు.
తులరాశి: ఈ రాశి వారికి సూర్య గ్రహణం ప్రభావం వల్ల చాలా బాగుంటుంది. ఈ రాశి వారు కోట్ల రూపాయిల నగదు సంపాదిస్తారు. ఆరోగ్యం సైతం బాగుంటుంది. పట్టిందల్లా బంగారమే. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. ఈ ఏడాది మొత్తం నాలుగు గ్రహణాలు ఏర్పడనున్నాయి. అందులో భాగంగా ఇప్పటికే మూడు గ్రహణాలు ఏర్పడ్డాయి. ఈ ఏడాది చివరి గ్రహణం.. సెప్టెంబర్ 22వ తేదీన ఏర్పడనుంది.
(గమనిక.. ఈ వార్తల్లో ఇచ్చిన సమాచారం కేవలం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. జోతిష్య పండితుల సూచనలు, సలహా మేరకు వారు వివరించిన అంశాల ఆధారంగా అందించినవి. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాల్సి ఉంటుంది. )
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణలో బొడ్డెమ్మ పండుగ సంబరాలు
ఈ రాశి వారు పెట్టుబడుల పొదుపు పథకాలకు సంబంధించిన కీలకమైన నిర్ణయం తీసుకుంటారు
For More Devotional News And Telugu News
Updated Date - Sep 16 , 2025 | 11:33 AM