ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Deepavali Festival: దీపావళి ఎందుకు.. ఎన్ని రోజులు జరుపుకుంటారు..?

ABN, Publish Date - Oct 16 , 2025 | 11:46 AM

ప్రపంచవ్యాప్తంగా దీపావళిని భారతీయులు ఘనం జరుపుకుంటారు. అయితే ఎందుకు ఈ పండగను జరుపుకుంటారు. ఎన్ని రోజుల పాటు జరుపుకుంటారంటే..

ఏడాదిలో అతి పెద్ద పండగలలో దీపావళి ఒకటి. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఈ పండగను ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులంతా జరుపుకుంటారు. అలాగే రాక్షస రాజు రావణుడిని సంహరించిన అనంతరం శ్రీరాముడు తన రాజ్యం అయోధ్యకు తిరిగి వస్తారు. ఆ రోజునే దసరాగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా అయోధ్యలో ప్రజలు దీపాలు వెలిగించి.. తమ ఇళ్లను అలంకరించి.. శ్రీరామునికి వారంతా స్వాగతం పలుకుతారు.

దీపావళి సమయంలో దీపాలు వెలిగించి, ఇళ్లను శుభ్రం చేయడం ద్వారా.. లక్ష్మీదేవి తమను అనుగ్రహిస్తుందని.. తద్వారా వచ్చే ఏడాది అనుగ్రహిస్తుందని ప్రజలు విశ్వసిస్తారు. అయితే దీపావళి అనేది ఒకే రోజు జరిగే పండుగ కాదు. పలు రోజుల పాటు జరుపుకునే గొప్ప వేడుక. ప్రతి ఒక్కటి ప్రత్యేక సంప్రదాయాలు, సాంస్కృతిక ఆచారాలతో ఈ పండగ నిండి ఉంటుంది.

ఇంతకీ దీపావళి ఎప్పుడు..

ఈ ఏడది దీపావళి సోమవారం.. అంటే అక్టోబర్ 20వ తేదీన వచ్చింది. ఈ రోజు లక్ష్మీదేవి, గణేశుడిని పూజిస్తారు. ప్రధానంగా చేసే దీపావళి పూజను లక్ష్మీ పూజగా పిలుస్తారు. ఇది సాయంత్రం వేళ చేస్తారు.

ఎన్ని రోజులు జరుపుకుంటారంటే..

దీపావళిని ఐదు రోజుల పాటు జరుపుకుంటారు. ప్రతి రోజు ప్రత్యేకమైనది. ఆధ్యాత్మికమైనది, సాంస్కృతికంగా ముఖ్యమైనది కూడా.

మొదటి రోజు: ధంతేరాస్.. అక్టోబర్ 18వ తేదీన వచ్చింది. ఈ రోజు లక్ష్మీదేవితోపాటు ఆరోగ్య ప్రధాత ధన్వంతరిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఈ రోజు ముఖ్యంగా కొత్త వస్తువులు బంగారం, వెండి లేదా పాత్రలను కొనుగోలు చేయడం చాలా శుభ్రప్రదంగా భావిస్తారు. ఇది కిర్తీతోపాటు అదృష్టాన్ని సూచిస్తుంది. దేవతలను స్వాగతించడానికి ఇళ్లను శుభ్రంగా అలంకరిస్తారు.

రెండో రోజు: నరక చతుర్దశి/ చోటి దీపావళి.. ఇది అక్టోబర్ 19వ తేదీ వచ్చింది. దీనిని చోటి దీపావళి అని పిలుస్తారు. ఈ రోజును నరకాసురుడు అనే రాక్షసుడి సంహరించడానికి ప్రతీకగా జరుపుకుంటారు. ఈ రోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి నూనెతో తలారా స్నానం చేయడం ఒక ఆచారం. దేశంలోని అనేక ప్రాంతాల్లో దీపావళి వేడుకలు ఈ రోజు నుంచే ప్రారంభమవుతాయి. ఈ రోజు పలువురు కాలువల వద్ద దీపాలు వెలిగిస్తారు. దీపాలు వెలిగించడంతోపాటు క్రాకర్లు కాల్చడం ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది.

మూడో రోజు: దీపావళి.. అక్టోబర్ 20వ తేదీ వచ్చింది. ఈ రోజు.. రావణుడిని చంపి శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వచ్చిన రోజు. ఇది చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకుంటారు. ఈ రోజు సాయంత్రం వేళ.. లక్ష్మీ, గణపతిలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. దీపాలు వెలిగిస్తారు. సంపద, ఆరోగ్యంతోపాటు ఆనందం కోసం ప్రార్థనలు చేస్తారు.

నాలుగో రోజు: ఈ రోజు గోవర్ధన్ పూజ నిర్వహిస్తారు. ఇది అక్టోబర్ 22వ తేదీన వచ్చింది. ప్రజలను రక్షించడానికి శ్రీకృష్ణుడు గోవర్ధన గిరి పర్వతాన్ని ఎత్తిన రోజుగా దీనిని పరిగణిస్తారు. ఈ రోజు ఆవులకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

ఐదో రోజు: భాయ్ దూజ్. ఇది అక్టోబర్ 23వ తేదీన జరుపుకుంటారు. సోదరులు, సోదరీమణుల మధ్య బంధానికి ప్రతీకగా జరుపుకుంటారు. ఈ రోజున సోదరీమణులు తమ సోదరుల శ్రేయస్సు కోసం నుదిటిపై తిలకం పెట్టుకుని బహుమతులు, స్వీట్లు ఇచ్చి పుచ్చుకుంటారు. ఈ రోజుతో దీపావళి వేడుకలు పూర్తవుతాయి.

అమావాస్య తిథి ఎప్పుడంటే..

అమావాస్య తిథి అక్టోబర్ 20 మధ్యాహ్నం 2. 40 గంటలకు ప్రారంభమవుతుంది. మరునాడు అంటే అక్టోబర్ 21వ తేదీ సాయంత్రం 4.05 గంటలకు ఈ అమావాస్య ఘడియలు ముగియనున్నాయి. సూర్యాస్తమయానికి అమావాస్య అక్టోబర్ 20వ తేదీనే ఉంది. కాబట్టి ఈ రోజే దీపావళి జరుపుకోవాలి.

ఇక ఆ రోజు పూర్తి ప్రదోష కాలం సాయంత్రం 5.46 గంటల నుంచి రాత్రి 8.18 గంటల వరకు ఉంటుంది. లక్ష్మీ పూజ కూడా అదే రోజు రాత్రి జరుపుకోవాలి. ఆ రాత్రి 7.08 గంటల నుంచి 8.18 గంటల మధ్య జరుపుకోవాలి.

ఈ వార్తలు కూడా చదవండి..

దీపావళి నుంచి ఈ ఐదు రాశులకు అదృష్ట యోగం

దీపావళి వేళ.. దీపాలు వెలిగించే ముందు ఈ చిట్కాలు పాటించండి

For More devotional News And Telugu News

Updated Date - Oct 16 , 2025 | 11:52 AM