WhatsApp: చివరకు అలా జరిగిందన్న మాట.. ఆటో వెనకాల ఉన్న పేరే..
ABN, Publish Date - Sep 09 , 2025 | 09:30 AM
నగరానికి వలస వచ్చిన జార్ఖండ్‌కు చెందిన వారంతా యోగక్షేమాలు తెలుసుకునేందుకు ఓ వాట్సాప్ గ్రూప్ పెట్టుకున్నారు. ఇదే గ్రూప్‌లో ఉన్న జార్ఖండ్‌కు చెందిన యువకుడి ఆటో చోరీకి గురైంది. ఇదే విషయాన్ని వాట్సాప్ గ్రూప్‌లో పోస్టు చేశాడు.
- దొంగను పట్టించింది
- వాట్సాప్‌లో పెట్టిన రెండు గంటలకే వివరాలు
హైదరాబాద్: నగరానికి వలస వచ్చిన జార్ఖండ్‌కు చెందిన వారంతా యోగక్షేమాలు తెలుసుకునేందుకు ఓ వాట్సాప్(WhatsApp) గ్రూప్ పెట్టుకున్నారు. ఇదే గ్రూప్‌లో ఉన్న జార్ఖండ్‌కు చెందిన యువకుడి ఆటో చోరీకి గురైంది. ఇదే విషయాన్ని వాట్సాప్ గ్రూప్‌లో పోస్టు చేశాడు. ఇది జరిగిన రెండు గంటల్లోనే ఆటో వెనకాల ఉన్న పేరును బట్టి వాట్సా్‌పలో ఉన్న మరో సభ్యుడు గుర్తించాడు. అడ్రస్‌తో సహా ఆటో ఎక్కడ ఉంది అనేది పోస్టు చేయడంతో కొంతమంది యువకులు ఆటోతోపాటు చోరుడిని కూడా పట్టుకొని పోలీసులకు అప్పగించారు.
జార్ఖండ్‌కు చెందిన బిపిన్ రాజ్‌యాదవ్ మూడు సంవత్సరాల క్రితం నగరానికి వచ్చి బొల్లారం(B0llaram)లోని ఓ గదిలో స్నేహితులతో కలిసి ఉంటున్నాడు. ఆటోను నడిపించుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈనెల 7న సవారీ అయిపోయాక ఆటోను ప్రతీ రోజు పెట్టే వద్ద పార్కింగ్‌లో ఉంచి తాళం వేసుకొని గదికి వెళ్లిపోయాడు. తెల్లవారుజామున ఆటో తీసేందుకు పార్కింగ్ ప్రాంతానికి రాగా వాహనం కనిపించలేదు. స్నేహితులను అప్రమత్తం చేయడంతోపాటు అన్నిచోట్లా వెతికాడు.
ఇదే విషయాన్ని బిపిన్‌తోపాటు ఉండే ఓ యువకుడు జార్ఖండ్ ఎక్తా మండల్ అనే వాట్సాప్ గ్రూప్‌లో పెట్టాడు. ఆటో వెనకాల బితిన్‌రాజ్‌యాదవ్ అనే పేరు ఉంటుందని ఎక్కడైనా కనిపిస్తే ఆచూకీ చెప్పాలని కోరాడు. పోస్టు చేసిన రెండు గంటల అనంతరం బంజారాహిల్స్ రోడ్డు నెంబర్.10 స్టార్ ఆస్పత్రి పక్క వీధిలో ఆటో ఉండడాన్ని జార్ఘండ్‌కు చెందిన కల్లురాం చూశాడు. ఆయితే, ఆటో వెనకాల బిపిన్ అని మాత్రమే ఉంది. రాజ్‌యాదవ్ అనే స్టిక్కర్ తొలగించినట్టు గుర్తించాడు. వెంటనే ఆటో వెనక బాగాన్ని ఫొటో తీసి వాట్సాప్ గ్రూప్‌లో షేర్ చేశాడు. అంతే గాకుండా ఆటో ఉన్న లోకేషన్‌ను పెట్టాడు.
అప్రమత్తమైన బిపిన్ తదితరులు బంజారాహిల్స్‌కు వచ్చారు. నేరుగా ఆటో వద్దకు వెళ్లి అందులో డ్రైవర్ సీటులో దర్జాగా కూర్చున్న వ్యక్తిని పట్టుకున్నారు. ఆటో తనదేనంటూ వ్యక్తి బుకాయించేందుకు ప్రయత్నించాడు. యువకులంతా కలిసి అతడిని బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు. చోరీ బొల్లారం పోలీసుస్టేషన్ పరిధిలో జరగడంతో బంజారాహిల్స్ పోలీసులు అక్కడి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కల్లురాం సమయస్ఫూర్తిని అందరూ అభినందించారు. మొత్తానికి ఆటో వెనకాల ఉన్న పేరు, వాట్సాప్ గ్రూప్ ఆటోను రెండు గంటల్లో తిరిగి పట్టించిందన్నమాట.
ఈ వార్తలు కూడా చదవండి..
స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
విద్యుత్తు రంగ కమిటీల పునర్వ్యవస్థీకరణ
Read Latest Telangana News and National News
Updated Date - Sep 09 , 2025 | 09:33 AM