ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: అయ్యోపాపం ఎంతఘోరం జరిగిందో.. శిల్పారామం దగ్గర..

ABN, Publish Date - Jun 03 , 2025 | 09:45 AM

రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఒకరు మృతిచెందిన విషాద సంఘటన హైదరాబాద్ నగరంలోని హైటెక్ సిటీ శిల్పారామం దగ్గర జరిగింది. ఏపీలోని అమలాపురానికి చెందిన చింతలపూడి సాయిమాధవ్‌.. ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పనిచేస్తున్నాడు. అయితే.. హైటెక్ సిటీ శిల్పారామం దగ్గర బైక్ అదుపుతప్పి కిందపడిపోవడంతో తలకు తీవ్రగాయమై మృతిచెందాడు.

- రోడ్డుప్రమాదంలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మృతి

హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మృతిచెందాడు. ఈ సంఘటన మాదాపూర్‌ పోలీస్‏స్టేషన్‌(Madhapur Police Station) పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్‌ కృష్ణమోహన్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని అమలాపురానికి చెందిన చింతలపూడి సాయిమాధవ్‌.. గచ్చిబౌలిలో నివసిస్తున్నాడు. ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పనిచేస్తున్నాడు. సోమవారం ఉదయం 6.30గంటల ప్రాంతంలో సుజుకీ యాక్సె్‌స్(టీజీ 08కె2288)పై గచ్చిబౌలి నుంచి కేపీహెచ్‌బీ వైపు వెళ్తున్నాడు.


శిల్పారామం వద్ద బైక్‌ అదుపు తప్పడంతో సాయిమాధవ్‌ కిందపడ్డాడు. అక్కడ ఉన్న డివైడర్‌ సాయిమాధవ్‌ తలకు తగిలింది. తీవ్ర గాయం కావడంతో కొండాపూర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే సాయిమాధవ్‌ మృతిచెందినట్టు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి.

నా పేరు కవిత... నేనెప్పుడూ ప్రజలపక్షమే

రాజన్న గోశాలలో మరో మూడు కోడెల మృతి

Read Latest Telangana News and National News

Updated Date - Jun 03 , 2025 | 09:45 AM