AP News: పాపను చూసి వస్తూ.. తండ్రి మృతి
ABN, Publish Date - Aug 26 , 2025 | 01:59 PM
పది రోజుల కన్నబిడ్డను చూసి వస్తూ.. తండ్రి రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఉమ్మడి జిల్లాలో రెండు వేర్వేరుచోట్ల రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతిచెందగా.. పలువురు గాయపడ్డారు. వజ్రకరూరు శివారులో ఆదివారం రాత్రి బైక్ అదుపుతప్పి బోల్తాపడడంతో నజీర్(20), బాబాఫకృద్దీన్(30) మృతిచెందారు.
- వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మృత్యువాత
- పలువురికి గాయాలు
వజ్రకరూరు(అనంతపురం): పది రోజుల కన్నబిడ్డను చూసి వస్తూ.. తండ్రి రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఉమ్మడి జిల్లాలో రెండు వేర్వేరుచోట్ల రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతిచెందగా.. పలువురు గాయపడ్డారు. వజ్రకరూరు(Vajrapukarur) శివారులో ఆదివారం రాత్రి బైక్ అదుపుతప్పి బోల్తాపడడంతో నజీర్(20), బాబాఫకృద్దీన్(30) మృతిచెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. పామిడికి చెందిన బాబాఫకృద్దీన్, ఫరూక్, నజీర్ మిత్రులు. భవన నిర్మాణ కార్మికులు. బాబాఫకృద్దీన్ అత్తగారి ఊరు ఉరవకొండ కాగా, 10 రోజుల క్రితం అతడికి కుమార్తె జన్మించింది. మిత్రులతో కలిసి కుమార్తెను చూడడానికి ఉరవకొండకు వచ్చాడు.
పాపను చూసి, ముగ్గురు ద్విచక్రవాహనంపై పామిడికి బయల్దేరారు. వజ్రకరూరు శివారులో వాహనం అదుపు తప్పి బోల్తాపడింది. దీంతో గాయపడిన వారిని ఉరవకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే నజీర్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతపురం ఆస్పత్రికి తరలించారు. బాబాఫకృద్దీన్ చికిత్స పొందుతూ సోమవారం అనంతపురంలో మృతిచెందాడు. ఫరూక్ పరిస్థితి విషమంగా ఉండడంతో కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.
ఆటో బోల్తాపడి మహిళ..
మండలంలోని కంబాలపర్తి గ్రామ సమీపంలో ఎగువ బ్రిడ్జి వద్ద ఆటో బోల్తాపడి మహిళ మృతిచెందగా.. పలువురు గాయపడ్డారు. మండలంలోని కుటాలపల్లి తండా నుంచి పుట్టపర్తిలోని సాయిబాబా మందిరంలో కూలి పనులకోసం రోజూ పదిమంది ఆటోలో వెళ్లేవారు. సోమవారం కూడా స్వగ్రామం నుంచి ఆటోలో పదిమంది, డ్రైవర్ ఉదయం బయలు దేరారు. కంబాలపర్తి సమీపంలో ఎగువ బ్రిడ్జి వద్దకు రాగానే బోల్తా అదుపుతప్పి, బోల్తాపడింది. ప్రమాదంలో ముత్యాలమ్మ (45) అక్కడిక్కడే మృతిచెందింది. గాయపడిన వారిని 108లో నల్లమాడ ఆస్పత్రికి తరలించారు.
మంగమ్మ, ఆమె భర్త రామచంద్రనాయక్, శివమ్మను మెరుగైన వైద్యం కోసం కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆటో డ్రైవర్ నరేంద్రరెడ్డి, మహే్‌షలకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాద స్థలాన్ని పోలీసులు పరిశీలించి, ముత్యాలమ్మ మృతదేహాన్ని కదిరి ఆస్పత్రికి తరలించారు. ఆమెకు భర్త శీనానాయక్, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆమె మృతిచెందడంతో కుటుంబసభ్యులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. మృతురాలి కుమారుడు శ్రీకాంత్‌నాయక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పసిడి ధరల్లో తగ్గుదల.. నేటి రేట్స్ ఎలా ఉన్నాయంటే..
ఆ అరగంటలోనే నగలు ఎత్తుకెళ్లారు..
Read Latest Telangana News and National News
Updated Date - Aug 26 , 2025 | 01:59 PM