ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Tiger: అమ్మోపులి.. పెద్దమ్మను చంపేసింది..

ABN, Publish Date - Nov 25 , 2025 | 01:17 PM

పులి దాడిలో ఓ వృద్ధురాలిని చంపేసిన విషాద సంఘటన తమిళనాడు రాష్ట్రం నీలగిరి జిల్లలో చోటుచేసుకుంది. నాగియమ్మాళ్‌ అనే వృద్ధురాలు పులి దాడిలో మృతిచెందడంతో ఆమె కుటుంబంలో విషాదం నెలకొంది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

- పులి దాడిలో మహిళ మృతి

చెన్నై: నీలగిరి(Neelagiri) జిల్లాలో పులి దాడి చేయడంతో ఓ మహిళ మృతిచెందింది. కూడలూరు సమీపం మావనల్లా అటవీ గ్రామానికి చెందిన నాగియమ్మాళ్‌ (65) ఆదివారం రాత్రి మేకలు, పశువులను తీసుకుని సమీపంలోని అడవికి వెళ్లింది. నాగయమ్మాళ్‌ నిల్చున్న ప్రాంతానికి కొంత దూరంలో ఉన్న వాగు దగ్గరకు వచ్చిన పులి ఆమెను నోటి కరుచుకుని అడవిలోకి లాక్కెళ్లింది. ఆ సమయంలో కొంద దూరంలో ఉన్న బాలుడు అది చూసి భయంతో గ్రామంలోకి పరుగులు తీసి విషయం చెప్పాడు. గ్రామస్తులు, మసినకుడి అటవీ శాఖ అధికారులు, సిబ్బంది హుటాహుటిన ఆ ప్రాంతానికి చేరుకున్నారు.

వారు అక్కడకు చేరుకునే సమయానికి నాగయమ్మాళ్‌ శరీరాన్ని తింటున్న పులి, గ్రామస్తుల కేకలతో మృతదేహాన్ని విడిచి అడవిలోకి పరుగులు తీసింది. అటవీ శాఖ అధికారులు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. తప్పించుకుపోయిన పులి, మళ్లీ దాడిచేసే అవకాశముందని, దానిని బంధించాలని గ్రామస్తులు అధికారులకు విజ్ఞప్తి చేశారు. సత్వరం బోనులు ఏర్పాటుచేసి పులిని బంధిస్తామని అధికారులు హామి ఇచ్చారు.

ఈ వార్తలు కూడా చదవండి..

బంగారం కొనాలనుకుంటున్నారా? అయితే త్వరపడండి.. పసిడి, వెండి ధరల్లో కోత

అది బూటకపు ఎన్‌కౌంటర్‌: ఈశ్వరయ్య

Read Latest Telangana News and National News

Updated Date - Nov 25 , 2025 | 01:17 PM