Gold Rates On Nov 25: బంగారం కొనాలనుకుంటున్నారా? అయితే త్వరపడండి.. పసిడి, వెండి ధరల్లో కోత
ABN , Publish Date - Nov 25 , 2025 | 06:34 AM
డాలర్ బలపడిన నేపథ్యం బంగారం ధరలు తగ్గాయి. భారత్‌లో కూడా ధరల్లో కోత పడింది. మరి నేడు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా కరెన్సీ డాలర్ బలపడుతున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు దిగొచ్చాయి. భారత్‌లో కూడా బంగారం ధర చెప్పుకోదగ్గ స్థాయిలో తగ్గింది. పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతున్నా కూడా రేట్స్‌లో కోత పడింది. గుడ్ రిటర్న్స్ వెబ్ సైట్ ప్రకారం, దేశంలో నేటి (నవంబర్ 25) ఉదయం 6.30 గంటల సమయంలో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ. 1,25,120. నిన్నటి ధరతో పోలిస్తే రూ.463 మేర తగ్గింది. ఇక 22 క్యారెట్ 10 గ్రాముల పసిడి ధర కూడా నిన్నటితో పోలిస్తే రూ.650 మేర తగ్గి రూ.1,14,690కు చేరుకుంది. వెండి ధరల్లో కూడా తగ్గుదల కనిపించింది. సోమవారం నాటి ధరతో పోలిస్తే ప్రస్తుతం వెండి రేటు రూ. వెయ్యి మేర తగ్గి రూ.1,62,900కు చేరింది (Gold, Silver Rates on Nov 25).
డాలర్ బలపడటంతో బంగారానికి డిమాండ్ కాస్త తగ్గిందని నిపుణులు చెబుతున్నారు. డాలర్ సూచీ ప్రస్తుతం 100 మార్కుకు పైనే కదలాడుతోంది. గత ఆరు నెలల్లో ఇదే అత్యధికం. దీంతో ఇన్వెస్టర్లకు కమోడిటీ మార్కెట్‌పై ఆసక్తి తగ్గింది. ఈ నేపథ్యంలో వచ్చే నెలలో జరగనున్న అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశాలపైనే అందరి దృష్టి నెలకొంది. ఈసారి అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లలో కోత విధించే అవకాశం 70 శాతంగా ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదే జరిగితే సురక్షిత పెట్టుబడి సాధనమైన పసిడికి మళ్లీ డిమాండ్ పెరిగి ధరలకు రెక్కలొచ్చే అవకాశం ఉంది. కాబట్టి, పసిడిపై పెట్టుబడి ఇది మంచి సమయమని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ప్రధాన నగరాల్లో 10 గ్రాముల బంగారం ధరలు (24కే, 22కే, 18కే)
చెన్నై: ₹1,25,660; ₹1,15,190; ₹96,090
ముంబై: ₹1,25,120; ₹1,14,690; ₹93,840
న్యూ ఢిల్లీ: ₹1,25,270; ₹1,14,840; ₹93,990
కోల్‌కతా: ₹1,25,120; ₹1,14,690; ₹93,840
బెంగళూరు: ₹1,25,120; ₹1,14,690; ₹93,840
హైదరాబాద్: ₹1,25,120; ₹1,14,690; ₹93,840
విజయవాడ: ₹1,25,120; ₹1,14,690; ₹93,840
కేరళ: ₹1,25,120; ₹1,14,690; ₹93,840
పూణె: ₹1,25,120; ₹1,14,690; ₹93,840
వడోదరా: ₹1,25,170; ₹1,14,740; ₹93,890
అహ్మదాబాద్: ₹1,25,170; ₹1,14,740; ₹93,890
కిలో వెండి ధరలు
చెన్నై: ₹1,70,900
ముంబై: ₹1,62,900
న్యూ ఢిల్లీ: ₹1,62,900
కోల్‌కతా: ₹1,62,900
బెంగళూరు: ₹1,62,900
హైదరాబాద్: ₹1,70,900
విజయవాడ: ₹1,70,900
కేరళ: ₹1,70,900
పూణె: ₹1,62,900
వడోదరా: ₹1,62,900
అహ్మదాబాద్: ₹1,62,900
ఇవీ చదవండి
Adani Group With FETC Acquisition: పైలట్ల శిక్షణలోకి అదానీ
RBI Governor Sanjay Malhotra: రెపో మరింత తగ్గుతుంది
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. వార్త రాస్తున్న సమయానికి ధరల వివరాలు పైన తెలిపిన విధంగా ఉన్నాయి. కాబట్టి బంగారం కొనుగోలు చేసే ముందు.. ధరలు మళ్లీ ఒకసారి పరిశీలించుకోగలరు.