Share News

Adani Group With FETC Acquisition: పైలట్ల శిక్షణలోకి అదానీ

ABN , Publish Date - Nov 25 , 2025 | 02:47 AM

అదానీ గ్రూప్‌ పైలట్ల శిక్షణ వ్యాపారంలో ప్రవేశించే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలిసింది. ఇందుకోసం, అదానీ గ్రూప్‌నకు చెందిన డిఫెన్స్‌, ఏరోస్పేస్‌ అనుబంధ విభాగం పైలట్లకు శిక్షణ ఇచ్చే ఫ్లైట్‌ సిమ్యులేషన్‌ టెక్నిక్‌ సెంటర్‌ను...

Adani Group With FETC Acquisition: పైలట్ల శిక్షణలోకి అదానీ

ఎఫ్‌‌ఎస్‌టీసీ కొనుగోలుపై ఫోకస్‌

న్యూఢిల్లీ: అదానీ గ్రూప్‌ పైలట్ల శిక్షణ వ్యాపారంలో ప్రవేశించే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలిసింది. ఇందుకోసం, అదానీ గ్రూప్‌నకు చెందిన డిఫెన్స్‌, ఏరోస్పేస్‌ అనుబంధ విభాగం పైలట్లకు శిక్షణ ఇచ్చే ఫ్లైట్‌ సిమ్యులేషన్‌ టెక్నిక్‌ సెంటర్‌ను (ఎఫ్‌‌ఎస్‌టీసీ) కొనుగోలు చేయాలనుకుంటున్నట్లు సమచారం. ఇందుకు సంబంధించిన చర్చలు పురోగతిలో ఉన్నాయని విశ్వసనీయ వర్గాలు తెలిపా యి. 2012లో ప్రారంభమైన ఎఫ్‌ఎ్‌సటీసీ.. హైదరాబాద్‌, ముంబై, గురుగ్రామ్‌ నగరాల్లో సిమ్యులేటర్‌ సెంటర్లను కలిగి ఉంది.. హర్యానా, సూరత్‌, షోలాపూర్‌లలో ఫ్లైట్‌ ట్రైనింగ్‌ అకాడమీలు కూడా నిర్వహిస్తోంది. అదానీ డిఫెన్స్‌ సిస్టమ్స్‌ అండ్‌ టెక్నాలజీ (ఏడీఎ్‌సటీ), ప్రైమ్‌ ఏరోల సమ భాగస్వామ్య సంస్థ హారిజాన్‌ ఏరో సొల్యూషన్స్‌ ద్వారా ఎఫ్‌ఎ్‌సటీసీ కొనుగోలు జరిపే అవకాశం ఉన్నదంటున్నారు. ఏడీఎ్‌సటీకి అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ ప్రమోటర్‌గా ఉండగా.. ఎన్‌సీపీ నాయకుడు, పౌర విమానయాన శాఖ మాజీ మంత్రి ప్రఫుల్‌ పటేల్‌ కుమారుడైన ప్రజయ్‌ పటేల్‌ నిర్వహణలోని సంస్థ ప్రైమ్‌ ఏరో. గత ఏడాది డిసెంబరులో ఎయిర్‌వర్క్స్‌లో మెజారిటీ వాటా కొనుగోలు ద్వారా విమానాల నిర్వహణ, మరమ్మతు విభాగంలోకి ప్రవేశించిన ఏడీఎ్‌సటీ.. ఆ తర్వాత కాలం లో ఇదే విభాగానికి చెందిన మరో సంస్థ ఇండామెర్‌ టెక్నిక్స్‌లోనూ 50 శాతం వాటా కొనుగోలు చేసింది. ఏరోస్పేస్‌, డిఫెన్స్‌ రంగంలో ఇప్పటికే రూ.5,000 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టిన అదానీ గ్రూప్‌.. మున్ముందు సంవత్సరాల్లో ఈ మొత్తాన్ని మూడింతలకు పెంచాలనుకుంటోంది.

ప్రథమార్ధంలో రికార్డు పనితీరు

సెప్టెంబరుతో ముగిసిన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో అదానీ గ్రూప్‌ కంపెనీలు బలమైన పనితీరు కనబరిచాయి. రికార్డు స్థాయి ఆదాయాలను ఆర్జించడంతోపాటు మూలధన వ్యయాలను భారీగా పెంచడం ఇందుకు తోడ్పడింది. ఈ ప్రథమార్ధంలో అదానీ గ్రూప్‌ రూ.67,870 కోట్ల పెట్టుబడులు పెట్టింది. దాంతో గ్రూప్‌ స్థూల ఆస్తులు రూ.6.77 లక్షల కోట్లకు పెరిగాయి. ఈ ఆర్థిక సంవత్సరం మొత్తానికి గ్రూప్‌ రూ.1.5 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రథమార్ధంలో అదానీ కంపెనీల మొత్తం ఎబిటా వార్షిక ప్రాతిపదికన 11.2 శాతం వృద్ధితో ఆల్‌టైం రికార్డు గరిష్ఠ స్థాయి రూ.92,943 కోట్లకు చేరుకుంది.

ఇవీ చదవండి:

అన్‌క్లెయిమ్డ్‌ బీమా మొత్తాలు క్లెయిమ్‌ చేసుకోవడం ఎలా

అమెజాన్‌లో భారీ లే ఆఫ్స్.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల పైనే ఎక్కువ ఎఫెక్ట్..

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 25 , 2025 | 02:48 AM