RBI Governor Sanjay Malhotra: రెపో మరింత తగ్గుతుంది
ABN , Publish Date - Nov 25 , 2025 | 02:13 AM
దేశంలో కీలక రెపోరేటు మరింతగా తగ్గించేందుకు వాతావరణం అనుకూలంగా ఉన్నదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హో త్రా అన్నారు. మరిన్ని రెపో కోతలకు పరిస్థితి సానుకూలంగా...
ఆర్‌బీఐ గవర్నర్
ముంబై: దేశంలో కీలక రెపోరేటు మరింతగా తగ్గించేందుకు వాతావరణం అనుకూలంగా ఉన్నదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హో త్రా అన్నారు. మరిన్ని రెపో కోతలకు పరిస్థితి సానుకూలంగా ఉన్న విషయం అక్టోబరు ఎంపీసీ సమావేశ సమయంలోనే ప్రకటించిన విషయం ఒక చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గుర్తు చేశా రు. ఆ పరిస్థితి ఏమీ మారలేదన్న విషయం ఆ తర్వాత వచ్చిన గణాంకాలు నిరూపించాయని ఆయన అన్నారు. అయితే డిసెంబరు మొదటి వారంలో జరుగబోయే ఎంపీసీ ఆ విషయం పరిగణనలోకి తీసుకుంటుందా, లేదా అనేది కమిటీయే నిర్ణయిస్తుందని చెప్పారు. 2024 సంవత్సరం ప్రథమార్ధంలో ఒక శాతం మేరకు రెపోరేటును తగ్గించిన ఎంపీసీ అక్టోబరులో మాత్రం విరామం ఇచ్చింది. అక్టోబరులో రిటైల్ ద్రవ్యోల్బణం 0.25 శాతానికి దిగి రావడం మరో విడత రెపోరేటుకు సానుకూల అంశమని విశ్లేషకులంటున్నారు.
ప్రైవేటు పెట్టుబడులు పెరుగుతాయ్
ఈ ఏడాది ఇప్పటివరకు తీసుకున్న ఆర్థిక, ద్రవ్య, నియంత్రణా పరమైన చర్యలతో ప్రైవేటు పెట్టుబడుల పునరుజ్జీవానికి అనుకూల వాతావరణం ఏర్పడినట్టు ఆర్‌బీఐ తాజా బులెటిన్‌లో తెలిపింది. ప్రపంచ దేశాల నుంచి వీస్తున్న ప్రతికూల పవనాలను కూడా తట్టుకుని మన ఆర్థిక వ్యవస్థ మరింత పుంజుకునే సంకేతాలనే వెలువరించిందని పేర్కొం ది. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో కొంత ఉత్సాహం కనిపిస్తోందని, అయితే ఆ జోరు నిలదొక్కుకుంటుందా...ఆర్థిక స్థిరత్వంపై దాని ప్రభావం ఏమిటి అనేవి ప్రశ్నార్ధకంగా ఉన్నాయని తెలిపారు.
ఈ ఏడాది వృద్ధి 6.5%: ఎస్ అండ్ పీ
ఇటీవల ప్రకటించిన పన్ను రేట్ల కోతలు, ద్రవ్య విధాన సడలింపులు వినియోగ వృద్ధికి ఊతం ఇస్తాయని, ఫలితం గా వృద్ధిరేటు వర్తమాన ఆర్థిక సంవత్సరంలో 6.5ు, వచ్చే ఏడాది 6.7ు ఉంటుందని ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ అంచనా వేసింది. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో ఇది 7.8ు ఉండగా రెండో త్రైమాసిక అధికారిక గణాంకాలు వచ్చే శుక్రవారం వెలువడనున్నాయి. అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదిరినట్టయితే అస్థిరతలు తొలగిపోయి, విశ్వా సం పెరగడంతో పాటు కార్మిక ఆధారిత రంగాలు మరింత ఉత్తేజితం కాగలవన్న ఆశాభావం ప్రకటించింది.
ఇవీ చదవండి:
అన్‌క్లెయిమ్డ్ బీమా మొత్తాలు క్లెయిమ్ చేసుకోవడం ఎలా
అమెజాన్‌లో భారీ లే ఆఫ్స్.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల పైనే ఎక్కువ ఎఫెక్ట్..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి