ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: ఇదోరకం మోసం.. రూ.10వేలకు అరగంటలో 5వేలు లాభం

ABN, Publish Date - Jun 12 , 2025 | 07:04 AM

రూ.10వేల పెట్టుబడికి అరగంటలో రూ.5వేలు లాభం ఇచ్చారు. ట్రేడింగ్‌పై నమ్మకం పెంచి నగరానికి చెందిన విద్యార్థినిని నుంచి రూ.1.27 లక్షలు కొట్టేశారు. సైబర్‌ క్రైమ్‌ పోలీసుల కథనం ప్రకారం నగరానికి చెందిన 24 ఏళ్ల విద్యార్థినిని జీపీ డిస్కషన్‌ 063 గ్రూపులో యాడ్‌ చేశారు.

- విద్యార్థినిని బురిడీ కొట్టించిన నేరగాళ్లు

- రూ. 1.27లక్షలకు టోకరా

హైదరాబాద్‌ సిటీ: రూ.10వేల పెట్టుబడికి అరగంటలో రూ.5వేలు లాభం ఇచ్చారు. ట్రేడింగ్‌పై నమ్మకం పెంచి నగరానికి చెందిన విద్యార్థినిని నుంచి రూ.1.27 లక్షలు కొట్టేశారు. సైబర్‌ క్రైమ్‌ పోలీసుల(Cyber ​​Crime Police) కథనం ప్రకారం నగరానికి చెందిన 24 ఏళ్ల విద్యార్థినిని జీపీ డిస్కషన్‌ 063 గ్రూపులో యాడ్‌ చేశారు. గోద్రేజ్‌ ప్రాపర్టీస్ లో పెట్టుబడులు పెడితే అరగంటలోనే అధిక లాభాలు వస్తాయని అందులో మెసేజ్‌ పెట్టారు. రోజుకు తక్కువలో తక్కువ రూ.5వేలు సంపాదించుకోవచ్చు అని బురిడీ కొట్టించారు.

ఇదేదో బాగుందని నమ్మిన బాధితురాలు ముందుగా రూ.10వేలు పెట్టుబడి పెట్టింది. అరగంటలో రూ.5 వేలు లాభంతో రూ.15 వేలు ఆమె ఖాతాలో జమ చేశారు. ఆ తర్వాత రూ.31,572 పెట్టుబడి పెడితే అరగంటలో రూ.70వేలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. చెప్పినట్లుగానే జమ చేశారు. దీంతో ఉత్సాహంగా ఆమె విడతల వారీగా రూ.1,27,354 చెల్లించింది. సైబర్‌ నేరగాళ్లు ఆ మొత్తాన్ని కాజేసి ఉడాయించారు. బాధితురాలు సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఈ వార్తలు కూడా చదవండి.

రూ. 1.2 కోట్ల హాషిష్‌ ఆయిల్‌ పట్టివేత

హలం పట్టి.. పొలం దున్ని..

Read Latest Telangana News and National News

Updated Date - Jun 12 , 2025 | 07:04 AM