ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: నకిలీ పత్రాలతో రూ.27 కోట్ల రుణం తీసుకుని పరార్‌

ABN, Publish Date - May 01 , 2025 | 10:38 AM

కంచే చేనును మేసిందన్న చందంగా.. బ్యాంకులో పనిచేస్తూ అక్రమార్కులకు సహకరించిన ఎ ప్రబుద్దుడి ఉదంతమిది. మొత్తం రూ. 27 కోట్లను తప్పుడు మార్గంలో మంజూరు చేశాడు. అయితే.. చేసిన తప్పు ఎప్పటికీ ఆగదన్నట్లు చివరకు పాపంపండి విషయం బయటపడింది. రుణం తీసుకున్న వ్యక్తి పరారీలో ఉండగాజజ సహకరించి ఉద్యోగి మాత్రం అరెస్టయ్యారు.

- నిందితులకు సహకరించిన ఎస్‌బీఐ ఏజీఎం అరెస్ట్‌

హైదరాబాద్‌: నకిలీ పత్రాలు సమర్పించి బ్యాంకు నుంచి రూ.27 కోట్ల వరకు రుణం తీసుకుని పరారైన కేసులో నిందితులకు సహకరించిన భారతీయ స్టేట్‌ బ్యాంకు (ఎస్‌బీఐ) అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజరు (ఏజీఎం)ను సీఐడీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ప్రస్తుతం గచ్చిబౌలి ఎస్‌బీఐలో ఏజీఎంగా విధులు నిర్వహిస్తున్న కె.సంజయ్‌, 2009-2011 మధ్యకాలంలో ఎస్‌బీఐ బాలానగర్‌ బ్రాంచ్‌లో మీడి యం ఎంటర్‌ ప్రైజెస్‌ విభాగంలో రిలేషన్‌షిప్‌ మేనేజరుగా పనిచేశారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: ఎమ్మెల్యే కార్యాలయంలో చెప్పులు విప్పేచోట పాకిస్థాన్‌ జెండా


ఆ సమయంలో ఆదర్శ్‌ కమ్యూనికేషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు క్యాష్‌ క్రెడిట్‌ లోన్‌ కింద రూ.27 కోట్ల రుణం మంజూరు చేశారు. రుణం కోసం సదరు సంస్థ నిర్వహకులు తప్పుడు పత్రాలు సమర్పిస్తున్నారన్న విషయం తెలిసి కూడా వారితో కలిసి సంజయ్‌(Sanjay) అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. తతరుణం కోసం తప్పుడు పత్రాలు సమర్పించిన సంస్థ ఎండీ ఆంజనేయులు, ఆయన భార్య మణికొండ రీటా సొమ్మును తిరిగి చెల్లించకుండా 2013 నుంచి తప్పించుకు తిరుగుతున్నారు.


బ్యాంకు అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇద్దరు ప్రధాన నిందితులను సీఐడీ పోలీసులు గత సంవత్సరం బెంగళూరులో అరెస్ట్‌ చేశారు. కేసు తదుపరి దర్యాప్తులో వారికి సహకరించిన ఏజీఎం సంజయ్‌తో పాటు కస్టమర్‌ సపోర్ట్‌ ఆఫీసర్‌ రవీంధ్రనాథ్‌ ప్రమేయం బయటపడింది. నిందితులకు సహకరించిన ఏజీఎం సంజయ్‌ను బుధవారం అరెస్ట్‌ చేసినట్లు సీఐడీ చీఫ్‌ షిఖాగోయల్‌ తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి

రాహుల్‌గాంధీ కుటుంబానికి ఆర్‌ఎస్ఎస్, బీజేపీలు బద్ధ శత్రువులే కదా

ఉద్యోగాల్లేకనే యువత డ్రగ్స్‌కు బానిసలు

సాగర్‌కు యజమాని తెలంగాణే

సీఎం సవాల్‌ స్వీకరిస్తున్నా..

Read Latest Telangana News and National News

Updated Date - May 01 , 2025 | 10:39 AM