Hyderabad: నెల రోజులైనా దొరకని నేపాలీ దొంగల ఆచూకీ
ABN, Publish Date - May 21 , 2025 | 07:11 AM
హైదరాబాద్ నగరంలో పలుచోట్ల దొంగతనాలకు పాల్పడిన నేపాల్ దొంగల ముఠా ఆచూకీ ఇంతవరకు లభించలేదు. గత నెల 20వ తేదీన పారిశ్రామికవేత్త హేమరాజు, అతని భార్యకు మత్తుమందు కలిపిన డ్రింక్స్ ఇచ్చి బంగారం, నగదు దోచుకుపోయిన విషయం తెలిసిందే. అయితే.. అప్పటినుంచి దొంగల కోసం పోలీసులు గాలిస్తున్నా వారి ఆచూకీ మాత్రం లభించడం లేదు.
హైదరాబాద్: కాచిగూడ(Kachiguda) పీఎస్ పరిధిలోని ఓ పారిశ్రామికవేత్త ఇంట్లో జరిగిన చోరీ కేసులో భారీ మొత్తంలో బంగారం, నగదును దోచుకుపోయిన నేపాలీ దొంగల ఆచూకీ ఇంతవరకు లభించలేదు. గత నెల 20వ తేదీన పారిశ్రామికవేత్త హేమరాజు, అతని భార్యకు మత్తుమందు కలిపిన డ్రింక్స్ ఇచ్చి బంగారం, నగదు దోచుకుపోయిన విషయం విదితమే.
ఈ వార్తను కూడా చదవండి: Illegal Immigrants: నలుగురు రోహింగ్యాల అరెస్టు
హేమరాజు ఇంట్లో పనికి కుదిరిన నేపాల్‌కు చెందిన అర్పిత, మరో ముగ్గురు లోకేంద్ర బహదూర్ షాహీ, దీపేందర్ ఆలియాస్ గజేందర్, చతుర్బుజ్ ఆలియాస్ ఆర్యన్‌లు ఈ దొంగతనానికి పాల్పడ్డారు. వీరిని పట్టుకోవడానికి తూర్పు మండలం డీసీపీ బాలస్వామి, అదనపు డీసీపీ జోగుల నర్సయ్య ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నేపాల్, లక్నో, గోరఖ్‌పూర్, ముంబై, బెంగళూర్(Nepal, Lucknow, Gorakhpur, Mumbai, Bangalore)లలో జల్లెడపట్టినా ఫలితం లేకపోయింది.
అయితే, ముంబైలో ఎక్కువసంఖ్యలో నేపాలీలు ఉండడంతో వారి వద్దే తలదాచుకుని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నట్లు తెలిసింది. ఏది ఏమైనా పారిశ్రామికవేత్త హేమరాజు ఇంట్లో జరిగిన దొంగతనం కాచిగూడ పోలీసులకు సవాల్‌గా మారింది.
ఈ వార్తలు కూడా చదవండి.
Gold Rates Today: పెరిగిన ధరలకు బ్రేక్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
నల్లమల సంపదపై రేవంత్ కన్ను: బీఆర్‌ఎస్
BSF Jawan: దేశసేవకు వెళ్లి.. విగతజీవిగా ఇంటికి..
Adilabad MP Nagesh: పటాన్‌చెరు- ఆదిలాబాద్ రైల్వే లైన్ నిర్మాణ పనులు చేపట్టాలి
Read Latest Telangana News and National News
Updated Date - May 21 , 2025 | 07:11 AM