Hyderabad: నల్సార్‌లో విద్యార్థి అనుమానాస్పద మృతి
ABN, Publish Date - Sep 24 , 2025 | 07:25 AM
మేడ్చల్ జిల్లా శామీర్‌పేటలోని నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్ర విద్యార్థి సహస్త్రాన్షు(22) శనివారం అర్ధరాత్రి అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఈ విషయం మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని రాయ్‌పూర్‌కు చెందిన సహస్త్రాన్షు నల్సార్‌లో బీఏ ఎల్‌ఎల్‌బీ ఫైనలియర్ చదువుతున్నాడు.
- ఆలస్యంగా వెలుగులోకి..
హైదరాబాద్: మేడ్చల్ జిల్లా శామీర్‌పేటలోని నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం(NALSAR Law University)లో న్యాయశాస్త్ర విద్యార్థి సహస్త్రాన్షు(22) శనివారం అర్ధరాత్రి అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఈ విషయం మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని రాయ్‌పూర్(Raipur)కు చెందిన సహస్త్రాన్షు నల్సార్‌లో బీఏ ఎల్‌ఎల్‌బీ ఫైనలియర్ చదువుతున్నాడు. ఇతని తమ్ముడు కూడా నల్సార్‌లో లా కోర్సులో మూడో సంవత్సరం చదుతున్నాడు.
కాగా, సహస్త్రాన్షు అనారోగ్యంతో బాధపడుతుండగా అతని తమ్ముడు, సహచర విదార్థులు కలిసి శనివారం రాత్రి అతన్ని అల్వాల్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి సుచిత్ర(Suchitra)లోని మరో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అర్ధరాత్రి వేళ వైద్యులు అతన్ని పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు. అనంతరం నల్సార్ అధికారులు రాయ్‌పూర్‌లో ఉన్న సహస్త్రాన్షు తల్లిదండ్రులకు సమాచారం అందించారు.
సహస్త్రాన్షు మృతదేహాన్ని రాయ్‌పూర్‌లోని అతని నివాసానికి తరలించారు. కాగా విద్యార్థి మృతికి గల కారణాలు తెలియరాలేదు. అతని మృతిపై ఆరా తీయగా విద్యార్థులు పలు రకాలుగా అనుమానాలు వ్యక్తం చేశారు. విద్యార్థి మృతి చెందడంతో అధికారులు మంగళవారం నుంచి నల్సార్ అకాడమికి సెలవులు ప్రకటించారు. కాగా, విద్యార్థి మృతికి సంబంధించి ఎటువంటి ఫిర్యాదు రాలేదని శామీర్‌పేట పోలీస్ ఇన్‌స్పెక్టర్ శ్రీనాథ్ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
భగ్గుమన్న బంగారం.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
హుస్సేన్ సాగర్‌కు పోటెత్తిన వరద.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన..
Read Latest Telangana News and National News
Updated Date - Sep 24 , 2025 | 07:25 AM