ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Bengaluru News: కనిపించకుండాపొయిన విద్యార్థి.. శవంగా...

ABN, Publish Date - Dec 27 , 2025 | 01:06 PM

కనిపించకుండా పొయిన విద్యార్థి.. చివరకు శవంగా లభ్యమైన సంఘటన కర్ణాటక రాష్ట్రంలో నిశాంక్‌ (15) అనే విద్యార్థి ఈనెల 15వతేదీ నుంచి కనిపించకుండా పోమయాడు. కాగా... బాలుడి మృతదేహం కుళ్ళినస్థితిలో గుర్తించారు. దీంతో బాలుడి కుటుంబం శోకసముద్రంలో మునిగిపోయింది.

బెంగళూరు: కొన్ని రోజులుగా కనిపించకుండా పోయిన పీయూసీ విద్యార్థి మృతదేహం శుక్రవారం లభించింది. బెంగళూరు గ్రామీణ జిల్లా దొడ్డబళ్ళాపుర తాలూకా సాధుమఠ గ్రామం రోడ్డు పక్కన మోరీ వద్ద బైక్‌ సహా విద్యార్థి మృతదేహాన్ని కుళ్ళినస్థితిలో గుర్తించారు. తాలూకాలోని దొడ్డ రాయప్పనహళ్ళి నివాసి నిశాంక్‌ (15) ఈనెల 15నుంచి కనిపించలేదు. కనిపించలేదు. చిక్క బళ్ళాపురలోని బెస్ట్‌ పీయూసీ కళాశాలలో ప్రథమ పీయూసీ చదువుతున్నాడు.

ఈనెల 15న కళాశాలకు వెళ్లలేదు. కాగా సాయంత్రం 7.30 గంటలకు అలా ఊరిలోకి వెళ్లి వస్తానని బైక్‌పై వెళ్లాడు. రాత్రి అయినా రాకపోవడంతో ఫోన్‌ చేసినా స్విచ్ఛాఫ్‌ అంటూ సమాధానం వస్తోంది. దీంతో తల్లిదండ్రులు చుట్టుపక్కల ఉన్న స్నేహి తులు, తదితరులను ఆరా తీశారు. అయినా ప్రయోజనం లేకపోయింది. 16న కనపించలేదని మహిళా పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. చివరకు శుక్రవారం అతడి మృతదేహం లభించడంపై కుటుంబంలో విషాదం నెలకొంది.

ఎవరో ఉద్దేశ్యపూర్వకంగా హతమార్చి ఉంటారని కుటుం బీకులు అభిప్రాయపడ్డారు. రూరల్‌ సీఐ సాదిక్‌ పాషా ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఫోరెన్సిక్‌ బృందాలు పరిశీలించారు. సమగ్ర దర్యాప్తు చేస్తే గానీ మృతికి గల కారణాలు తెలియవని పోలీసులు అభిప్రాయపడ్డారు. శశాంక్‌ది సాధారణ మృతియా లేదా హత్యయా అనేది ఒక స్పష్టత రానుందన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

బంగారం ధరల్లో 5 రోజులుగా ర్యాలీ! ప్రస్తుత రేట్స్ ఇవీ..

3, 4, 5 తేదీల్లో మూడవ తెలుగు మహాసభలు

Read Latest Telangana News and National News

Updated Date - Dec 27 , 2025 | 02:17 PM