ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Tirupati New: తిరుపతిలో కర్ణాటక ముఠా..

ABN, Publish Date - Oct 08 , 2025 | 11:58 AM

తిరుపతిలో ఇటీవల చైన్‌ స్నాచింగ్‌లు, దొంగతనాలకు పాల్పడేది కర్ణాటక గ్యాంగ్‌ అని పోలీసులు గుర్తించారు. వీరు నగరాన్ని షెల్టర్‌ జోన్‌గా చేసుకుని చైన్‌ స్నాచింగ్‌ల నుంచి ద్విచక్ర వాహనాలు చోరీ చేయడం, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో మహిళలు, వృద్ధుల బ్యాగులు ఎత్తుకెళ్లి ఆభరణాలు, నగదు కొట్టేస్తున్నారని తెలిసింది.

- చైన్‌ స్నాచింగ్‌, దొంగతనాలకు పాల్పడుతున్న దుండగులు

తిరుపతి: తిరుపతి(Tirupati)లో ఇటీవల చైన్‌ స్నాచింగ్‌లు, దొంగతనాలకు పాల్పడేది కర్ణాటక గ్యాంగ్‌(Karnataka Gang) అని పోలీసులు గుర్తించారు. వీరు నగరాన్ని షెల్టర్‌ జోన్‌గా చేసుకుని చైన్‌ స్నాచింగ్‌ల నుంచి ద్విచక్ర వాహనాలు చోరీ చేయడం, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో మహిళలు, వృద్ధుల బ్యాగులు ఎత్తుకెళ్లి ఆభరణాలు, నగదు కొట్టేస్తున్నారని తెలిసింది. వీరు ఆరు నెలలకు ఒకసారి తాము ఎంచుకున్న ప్రాంతాలకు వెళ్లి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు సమాచారం.

ఈ ముఠాల కోసం జిల్లా పోలీసులు ఆరేడు నెలలుగా గాలిస్తున్నారు. తిరుపతిలో కర్ణాటకకు చెందిన దాదాపు 10 గ్యాంగుల సభ్యులు దొంగతనాలకు పాల్పడుతున్నట్లు చెబుతున్నారు. రెండు రోజుల తిరుపతిలో క్రితం తిరుపతిలోని పోస్టల్‌ కాలనీలో ఒకరు.. అలిపిరి పరిధిలోని నలుగురు మహిళల మెడల నుంచి దాదాపు 186 గ్రాముల బంగారు చైన్లు లాక్కొని పరారయ్యారు. ఈ పనికి పాల్పడింది కర్ణాటక ముఠానే అని తాజాగా భావిస్తున్నారు. మంగళవారం సాయంత్రం తిరుపతి రూరల్‌ పరిధిలోని చిగురవాడలో ఇద్దరు మహిళల మెడల నుంచి చైన్లు లాక్కెళ్లారు.

వీరు స్థానికంగా ద్విచక్ర వాహనాలు దొంగిలించి, ఇలాంటి నేరాలకు పాల్పడుతుండటంతో పోలీసులు తొలుత స్థానికులే ఈ పనికి పాల్పడినట్లు భావించారు. కానీ, విచారణలో కర్ణాటక గ్యాంగు ఈ నేరాలకు పాల్పడుతున్నట్లు తెలిసిందని పోలీసు వర్గాలు తెలిపాయి. మరోవైపు చైన్‌ స్నాచింగ్‌(Chain Snaching) నేపథ్యంలో వాకింగ్‌ వెళ్లే మహిళలు ఆందోళన చెందుతున్నారు. వాకింగ్‌ సమయంలో విలువైన ఆభరణాలు వేసుకెళ్లొద్దని పోలీసులూ సూచిస్తున్నారు. ఈ ముఠాపై నిఘా పెట్టామని, త్వరలోనే వారిని పట్టుకుంటామని ఓ పోలీసు అధికారి చెప్పారు.

ఈ వార్తలు కూడా చదవండి..

పసిడి పరుగు మరింత ముందుకు.. బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

బిగ్ బాస్‌కి బిగ్ షాక్.. అసలు విషయమిదే..

Read Latest Telangana News and Nationa

Updated Date - Oct 08 , 2025 | 11:58 AM