ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: కుదువ పెట్టిన నగలతో వ్యాపారి పరార్‌

ABN, Publish Date - Aug 26 , 2025 | 10:45 AM

కుదువ పెట్టిన నగలతో ఫిలింనగర్‌(Filmnagar)కు చెందిన ఓ వ్యాపారి ఉడాయించాడు. అచ్చు ఇలాంటి ఘటనే ఇటీవల కృష్ణానగర్‌లో జరిగింది. ఈ ఘటన మరవకముందే మరో ఘటన చోటు చేసుకోవడంతో ఫిలింనగర్‌ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తూ పోలీసులను ఆశ్రయించారు.

- కృష్ణానగర్‌ ఘటన మరవకముందే ఫిలింనగర్‌లో మరో ఘటన

హైదరాబాద్: కుదువ పెట్టిన నగలతో ఫిలింనగర్‌(Filmnagar)కు చెందిన ఓ వ్యాపారి ఉడాయించాడు. అచ్చు ఇలాంటి ఘటనే ఇటీవల కృష్ణానగర్‌లో జరిగింది. ఈ ఘటన మరవకముందే మరో ఘటన చోటు చేసుకోవడంతో ఫిలింనగర్‌ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తూ పోలీసులను ఆశ్రయించారు. వ్యాపారిపై పోలీసులు నాలుగు కేసులు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. రాజస్థాన్‌కు చెందిన మాణిక్‌ చౌదరి నగరంలో ఫిలింనగర్‌లో 20 ఏళ్ల క్రితం మాణిక్‌ జువెలరీస్‌ పేరిట నగల అమ్మకాలు, కుదవ వ్యాపారం మొదలు పెట్టాడు.

కొద్ది కాలంలోనే బస్తీ వాసుల నమ్మకాన్ని పొందాడు. ఫిలింనగర్‌ బస్తీలతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన వారు కూడా నగలను అతని వద్ద కుదవ పెట్టేవారు. అయితే, మాణిక్‌ చౌదరి వారం రోజులుగా షాపు తెరవలేదు. ఇంటివద్దకు ఎవరూ లేకపోవడంతో స్థానికులు అనుమానించారు. కుదవ పెట్టిన నగలతో అతను ఉడాయించి ఉంటాడని బాధితులు పోలీసులను ఆశ్రయించారు. బసవతారకనగర్‌కు చెందిన జనార్ధన్‌రెడ్డి ఐదు తులాల బంగారం కుదవ పెట్టి రూ.2.55 లక్షలు తీసుకున్నాడు. ఆగస్టు4న డబ్బు తిరిగి చెల్లించాడు. 18న నగలు ఇస్తానని చెప్పిన మాణిక్‌ చెప్పి ఆ తర్వాత దుకాణం తెరవలేదు. అలాగే ఓ పూజారి ఇంట్లో పెళ్లికి బంగారు నగలిప్పిస్తానని రూ.17 లక్షలు తీసుకున్నాడు.

ఆ తర్వాత జంప్‌ అయ్యాడు. ఇలా చాలామంది కుదవపెట్టిన బంగారు ఆభరణాలను తీసుకుని ఉడాయించినట్లు పలువురు బాధితులు ఫిలింనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాలుగు వేర్వేరు ఎఫ్‌ఐఆర్‌లు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారుర. మాణిక్‌ చౌదరి కొంతమంది వద్ద చిటీల పేరుతో, అప్పు పేరుతో లక్షల రూపాయలు తీసుకున్నట్టు ఫిలింనగర్‌లో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు అభిప్రాయపడుతున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

పసిడి ధరల్లో తగ్గుదల.. నేటి రేట్స్ ఎలా ఉన్నాయంటే..

ఆ అరగంటలోనే నగలు ఎత్తుకెళ్లారు..

Read Latest Telangana News and National News

Updated Date - Aug 26 , 2025 | 10:45 AM