ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Jaipur school suicide: తోటి విద్యార్థుల వేధింపులు.. బాలిక సూసైడ్, ఆడియో రిలీజ్

ABN, Publish Date - Nov 08 , 2025 | 10:16 AM

జైపూర్‌ నగరంలోని ఓ ప్రైవేటు స్కూల్ బిల్డింగ్‌ పైనుంచి దూకి తొమ్మిదేళ్ల బాలిక అమైరా (12) ఆత్మహత్య చేసుకున్న ఘటన జరిగిన విషయం తెలిసిందే. తాజాగా పాఠశాలలో తోటి విద్యార్థుల వేధింపుల వల్లే తమ కన్నబిడ్డ సూసైడ్ చేసుకుందని ఆ బాలిక తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు తన కూతురు మాట్లాడిన ఆడియోను మీడియాతో పంచుకున్నారు.

Jaipur school suicide

జైపూర్, నవంబర్ 8: రాజస్థాన్ రాష్ట్రం జైపూర్‌ నగరంలోని ఓ ప్రైవేటు స్కూల్ బిల్డింగ్‌ పైనుంచి దూకి తొమ్మిదేళ్ల బాలిక అమైరా (12) ఆత్మహత్య చేసుకున్న ఘటనలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. పాఠశాలలో తోటి విద్యార్థుల వేధింపుల వల్లే తమ కన్నబిడ్డ సూసైడ్ చేసుకుందని ఆ బాలిక తల్లిదండ్రులు ఆరోపించారు. తమ బిడ్డను తోటి విద్యార్థులు బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు. స్కూల్‌కు వెళ్లనంటూ తమ కుమార్తె ఏడుస్తున్న ఆడియోను మృతురాలి తల్లి మీడియాకు షేర్ చేశారు. ఆ ఆడియోలో తాను పాఠశాలకు వెళ్లాలనుకోవడం లేదని.. తనకు పంపించొద్దు ప్లీజ్‌ అంటూ విద్యార్థిని వేడుకున్న వాయిస్ ఉంది. అయితే అమ్మాయి బిల్డింగ్ నుంచి దూకేసిన తరువాత పోలీసులు వచ్చేలోపు పాఠశాల సిబ్బంది ఆ ప్రాంతాన్ని, రక్తపు మరకలను శుభ్రం చేయడంపై అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. సీసీటీవీ ఫుటేజ్‌ పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

అక్కడి మీడియాకు తన కూతురి వాయిస్ అందజేసిన అనంతరం తల్లి శివాని మీనా మాట్లాడారు. ఈ ఆడియోను క్లాస్‌ టీచర్‌తో పాటు కో-ఆర్డినేటర్‌కు పంపించి వారితో చాలాసార్లు మాట్లాడానని.. అయినా వాళ్లు తన మాటలు పట్టించుకోలేదని చెప్పారు. పాఠశాలలో తన కుమార్తెను ఆట పట్టించడం, బెదిరించడం, లైంగిక వేధింపుల వంటివి కొన్ని నెలల పాటు జరిగాయని ఆవేదన వెళ్లగక్కారు. అటు తన కుమార్తె, మరో అబ్బాయిని ఉద్దేశిస్తూ తోటి విద్యార్థులు ఏడిపించారని బాలిక తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు.

నవంబరు 1న జైపుర్‌లోని ప్రముఖ పాఠశాల నాల్గో అంతస్తు నుంచి దూకి తొమ్మిదేళ్ల విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఆమెను ఆస్పత్రికి తరలించే లోపే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు వైరల్‌ అయ్యాయి. సమాచారం అందుకొన్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేసరికే.. ఆ విద్యార్థిని పడిన ప్రాంతంలో రక్తం మరకలు మాయమయ్యాయి. దీంతో ఆమె మరణంపై అనుమానాలు తీవ్రమయ్యాయి. పాఠశాల యాజమాన్యంపై విద్యార్థి తల్లిదండ్రులు కేసు పెట్టారు. ఈ ఘటనపై డీసీపీ రాజర్షి రాజ్‌వర్మ మాట్లాడుతూ.. విద్యార్థి తల్లిదండ్రుల స్టేట్‌మెంట్లు తీసుకున్నామన్నారు. వారి ఆరోపణల కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నామన్నారు. అయితే ఈ ఆరోపణలపై పాఠశాల యాజమాన్యం ఇంతవరకు స్పందించలేదు. ఈ విషయంపై టీచర్లకు చెప్పినా, వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.

ఇవి కూడా చదవండి:

PM Modi: వారణాసిలో మోదీ పర్యటన.. నాలుగు వందేభారత్‌ రైళ్లు ప్రారంభం

J and K Encounter: జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదుల హతం

Updated Date - Nov 08 , 2025 | 10:16 AM