Instagram: భార్య ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు..
ABN, Publish Date - Aug 08 , 2025 | 08:25 AM
ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అసభ్యకరంగా తీసిన భార్య ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు భర్త. మనస్తాపం చెందిన ఆమె ఆత్మహత్యకు యత్నించింది. ఈ సంఘటన రాంగోపాల్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది.
- మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్: ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అసభ్యకరంగా తీసిన భార్య ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్(Instagram)లో పోస్టు చేశాడు భర్త. మనస్తాపం చెందిన ఆమె ఆత్మహత్యకు యత్నించింది. ఈ సంఘటన రాంగోపాల్‌పేట్ పోలీస్‌స్టేషన్(Ramgopalpet Police Station) పరిధిలో జరిగింది. ఓ యువతి(20)కి గతంలో తను పనిచేసే చోట రామంతాపూర్‌కు చెందిన భీమ్‌రాజ్(22)తో పరిచయం అయింది. అది ప్రేమగా మారడంతో మే 5వ తేదీన యువకుడితో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయి 8వ తేదీన సైదాబాద్ ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకున్నారు.
10వ తేదీన భర్త, కుటుంబసభ్యులతో కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ‘తాను మేజర్‌నని, ఇష్టపూర్వకంగానే వివాహం చేసుకున్నానని’ లిఖిత పూర్వకంగా రాసి ఇచ్చింది. కొద్ది రోజుల తర్వాత అత్తింటి వారి వేధింపులు పెరిగాయని తిరిగి పుట్టింటికి వచ్చింది. వేధింపులపై బేగంపేట మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కౌన్సెలింగ్ అనంతరం తిరిగి అత్తగారింటికి వెళిలన ఆమె ఇటీవల పుట్టింటికి వచ్చింది. ఈనెల 5వ తేదీ రాత్రి భర్తకు ఫోన్ చేసింది.
తనకు వాంతులు అవుతున్నాయని, గర్భవతిని అయ్యానేమోనని అనుమానంగా ఉందని, ఆస్పత్రికి తీసుకెళ్లమని చెప్పింది. గర్భం నావల్ల వచ్చిందని గ్యారెంటీ ఏమిటని అతడు ఆమెను ప్రశ్నించాడు. అసభ్యకరంగా తీసిన భార్య ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. మనస్తాపం చెందిన ఆమె అదేరోజు రాత్రి ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన తల్లి 108 అంబులెన్స్‌కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వగా గాంధీ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆల్‌టైం గరిష్ఠానికి పసిడి ధరలు.. ఎంతకు చేరుకున్నాయంటే..
ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్‌కు అరుదైన గుర్తింపు
Read Latest Telangana News and National News
Updated Date - Aug 08 , 2025 | 08:25 AM