Hyderabad: అవమానంతో వ్యక్తి ఆత్మహత్య
ABN, Publish Date - Sep 11 , 2025 | 07:23 AM
అవమానంతో ఓ వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపణలు, రెండుసార్లు ఆమె కుటుంబ సభ్యుల దాడితో మనస్తాపం చెందిన వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. కాగా, మహిళ ఆమె కుటుంబాన్ని తప్పుబడుతూ అసోసియేషన్ సభ్యులు ధర్నా నిర్వహించారు.
- అసభ్యంగా ప్రవర్తించాడంటూ మహిళ ఆరోపణలు
- అతడిపై ఆమె కుటుంబసభ్యుల దాడి
- సొసైటీ సభ్యుల జోక్యంతో సమసిన వివాదం
- బుధవారం తెల్లవారుజాము మారణాయుధాలతో మరోసారి...
- కైసర్‌నగర్‌లోని డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల వద్ద ఉద్రిక్తత
హైదరాబాద్: అవమానంతో ఓ వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపణలు, రెండుసార్లు ఆమె కుటుంబ సభ్యుల దాడితో మనస్తాపం చెందిన వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. కాగా, మహిళ ఆమె కుటుంబాన్ని తప్పుబడుతూ అసోసియేషన్ సభ్యులు ధర్నా నిర్వహించారు. దీంతో కైసర్‌నగర్‌లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
సూరారం సీఐ సుధీర్‌కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం... ఖమ్మం(Khammam) జిల్లాకు చెందిన బియ్యంపల్లి రాజు(55) కుటుంబ సభ్యులతో కలిసి గాజులరామారం కైసర్‌నగర్‌లోని డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలో ఫ్లాట్ నంబరు-6,హౌస్ నంబర్ 302లో నివాసం ఉంటున్నాడు. బాలానగర్‌లోని ఓ సంస్థలో ఉద్యోగి. రాజు ఎప్పటిలాగే విధులు ముగించుకొని మంగళవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఇంటి వద్దకు చేరుకున్నాడు. మెట్లు ఎక్కే క్రమంలో ఇంటిపక్కనే ఉంటున్న బ్లాక్ నంబరు-2, ఫ్లాట్ నంబరు 811లో నివాసం ఉండే నౌషీన్ అనే మహిళ రాజును తాకింది. ఆ తర్వాత రాజే అసభ్యకరంగా తాకాడంటూ ఆరోపణలు చేసింది.
దీంతో ఆమె బంధువులు షాజహాన్, హజుమాన్, నౌషీన్ కలిసి రాజుపై దాడి చేశారు. గొడవ జరుగుతున్న క్రమంలో సొసైటీ సభ్యులు వచ్చి, సర్ది చెప్పి పంపివేశారు. మళ్లీ మరుసటి రోజు తెల్లవారుజాము 2 గంట లకు మారాణాయుధాలతో రాజు ఇంటిపై దాడి చేసి కులం పేరుతో దూషించి చంపేస్తామని బెదిరించారు. ఈ ఘటనతో మనస్తాపానికి గురైన రాజు ఇదే రోజు తెల్లవారుజాము ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య బియ్యంపల్లి జ్యోతి సూరారం పోలీసులు సమాచారం అందించింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృత దేహాన్ని గాంధీకి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
నాలుగు కుటుంబాలపై ఇదే తరహాలో బ్లాక్ మెయిల్
బియ్యంపల్లి రాజు మృతికి కారణమైన కుటుంబాన్ని డబుల్ బెడ్ రూమ్ నుంచి వెలి వేయాలని కైసర్‌నగర్‌లోని డబుల్ బెడ్ రూమ్ అసోసియేషన్ సభ్యులు నిరసన తెలిపారు. గతంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో నాలుగు కుంటుంబాలకు చెందిన వారిని ఇదే తరహాలో ఆరోపణలు చేసి నౌషీన్ కుటుంబ సభ్యులు దాడి చేసి, వారిని గాయపరిచిన సందర్భాలు ఉన్నాయని, ఎవరు అడ్డు వస్తే వారిని నోటికి వచ్చినట్లు తిడుతూ అక్కడ భయాందోళన వాతావరణం సృష్టించే వారన్నారు. వ్యక్తి మృతికి కారణమైన కుటుంబాన్ని వెలివేయాలంటూ నినాదాలు చేసి, ధర్నా నిర్వహించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మరింత పెరిగిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
Read Latest Telangana News and National News
Updated Date - Sep 11 , 2025 | 07:23 AM