Hyderabad: యాత్రలకు వెళ్లి వచ్చేసరికి ఇల్లు గుల్ల..
ABN, Publish Date - Dec 12 , 2025 | 09:43 AM
యాత్రలకు వెళ్లి వచ్చేసరికి ఇల్లు గుల్ల అయిన సంఘటన హైదరాబాద్ నగరంలోని మలక్‌పేట్‌లో చోటుచేసుకుంది. మొత్తం 17 తులాల బంగారం, 4 కిలోల వెండి, 45 లక్షల నగదు చోరీకి గురైంది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
- 17 తులాల బంగారం, 4 కిలోల వెండి, 45 లక్షల నగదు చోరీ
హైదరాబాద్: ఇంటి యాజమాని యాత్రలకు వెళ్లొచ్చేసరికి దొంగలు ఇల్లు గుల్ల చేశారు. అల్మారాలో దాచిపెట్టిన నగలు, నగతును ఎత్తుకెళ్లారు. మలక్‌పేట క్రైం ఇన్‌స్పెక్టర్ జయశంకర్ తెలిపిన వివరాల ప్రకారం.. మలక్‌పేట ప్రొఫెసర్స్ కాలనీ మానస రెసిడెన్సీ అపార్ట్‌మెంట్ ఫ్లాట్ 102లో వెంకటరమణ 20 ఏళ్ల నుంచి ఒంటరిగా నివాసం ఉంటున్నాడు. అతను తరచూ గోవా, పాండిచ్చేరి, తిరువనంతపురం, చెన్నై(Goa, Pondicherry, Thiruvananthapuram, Chennai) తదితర ప్రాంతాలకు వెళ్లి వస్తుంటాడు. గత నెల నవంబరు 13న వెంకటరమణ యాత్రలకు వెళ్లి బుధవారం రాత్రి హైదరాబాద్‌కు వచ్చాడు.
హాల్‌లో తలుపు పగిలి ఉండడం, వస్తువులు పడి ఉండడంతో చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రూ.45లక్షల నగదు, రూ.17 తులాల బంగారు నగలు, 4కిలోల వెండి నగలు ఎత్తుకెళ్లినట్లు, వాటి విలువ సుమారు రూ. 70 లక్షలు ఉంటుందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. వెంకటరమణ ఇంట్లో చోరి జరిగిన తర్వాత అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మన్‌గా పనిచేస్తున్న నేపాల్‌కు చెందిన అర్జున్ సమాచారం ఇవ్వకుండానే నవంబరు 26న సామాన్లను వదిలి వెళ్లిపోయినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అర్జున్ 5నెలల క్రితం వాచ్‌మన్‌గా చేరినట్లు అపార్ట్‌మెంట్ వాసులు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు ఎంతంటే..
విషాదం.. లోయలో పడిపోయిన ట్రావెల్ బస్సు..
Read Latest Telangana News and National News
Updated Date - Dec 12 , 2025 | 09:43 AM