ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: కల్లు అంతపని చేసిందన్నమాట.. ఏం జరిగిందంటే...

ABN, Publish Date - Oct 02 , 2025 | 11:55 AM

తాగిన మైకంలో భర్తను సుత్తితో కొట్టి చంపిన భార్య ఉదంతమిది. బోరబండ పోలీస్‏స్టేషన్‌ పరిధిలోని ఎస్పీఆర్‌ హిల్స్‌ రాజీవ్‌గాంధీనగర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్‌ జిల్లా కొల్లాపూర్‌ పెద్దకొత్తపల్లికి చెందిన దేవరపాగ బాలస్వామి(60), డి.దేవమ్మ(54) భార్యాభర్తలు.

- భర్తను సుత్తితో కొట్టి చంపిన భార్య..

- కల్లు తాగిన మైకంలో దారుణం

హైదరాబాద్: తాగిన మైకంలో భర్తను సుత్తితో కొట్టి చంపిన భార్య ఉదంతమిది. బోరబండ పోలీస్‏స్టేషన్‌(Borabanda Police Station) పరిధిలోని ఎస్పీఆర్‌ హిల్స్‌ రాజీవ్‌గాంధీనగర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్‌ జిల్లా కొల్లాపూర్‌ పెద్దకొత్తపల్లికి చెందిన దేవరపాగ బాలస్వామి(60), డి.దేవమ్మ(54) భార్యాభర్తలు. బతుకు దెరువు కోసం చాలా ఏళ్ల క్రితం నగరానికి వచ్చి ఎస్పీఆర్‌ హిల్స్‌ రాజీవ్‌గాంధీనగర్‌ గుడిసెల్లో ఉంటున్నారు.

దంపతులిద్దరూ ఉదయాన్నే కూలీ పనికి వెళ్లి, సాయంత్రం ఇంటికి వస్తూ కాంపౌండ్‌లో కల్లు తాగేవారు. తాగిన మైకంలో ఇద్దరూ అరుస్తూ గొడవ పడుతుంటారు. ఈ క్రమంలోనే మంగళవారం రాత్రి కల్లు తాగిన దంపతులిద్దరూ గొడవపడ్డారు. ఇద్దరి మధ్య మాటామాట పెరగడంతో తీవ్ర ఆవేశానికి గురైన దేవమ్మ ఇంట్లోని పెద్ద సుత్తితో భర్త బాలస్వామి తలపై గట్టిగా మోదింది. తీవ్రంగా గాయపడిన బాలస్వామి అక్కడికక్కడే మృతిచెందాడు.

ఇంత జరిగినా చుట్టుపక్కల వాళ్లు రోజూ జరిగే తంతే అనుకొని లైట్‌గా తీసుకున్నారు. దేవమ్మ స్వయంగా బయటకు వచ్చి చెప్పే వరకు విషయం ఎవరికీ తెలియలేదు. సమాచారం అందుకున్న కుటుంబసభ్యులు రక్తపు మడుగులో పడి ఉన్న బాలస్వామిని సమీపంలోని ఆస్పత్రికి తరలించగా అప్పటికి మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. బోరబండ పోలీసులు బాలస్వామి మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. ఇదిలా ఉండగా, మృతుడు బాలస్వామి భార్య దేవమ్మను తరచూ వేధించేవాడని,

రక్తం కారేలా కొట్టేవాడని, జుట్టు పట్టి బలవంతంగా బయటకు ఈడ్చుకు వచ్చే వాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో కుటుంబసభ్యులు పేర్కొన్నారు. మంగళవారం సాయం త్రం రాజీవ్‌గాంధీనగర్‌ బస్తీలో మంత్రి వివేక్‌ పాల్గొన్న కార్యక్రమంలో కల్లు తాగిన మత్తులో ఉన్న దేవమ్మ డ్యాన్స్‌ కూడా చేసిందని బస్తీవాసులు తెలిపారు. కుమారుడు డి.వెంకటేష్‌ ఫిర్యాదు మేరకు బోరబండ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

బంగారం ధర తగ్గేదేలే.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

టాప్ ప్లేస్‌లో అంబానీ.. దేశంలో అత్యంత సంపన్నులు వీరే..

Read Latest Telangana News and National News

Updated Date - Oct 02 , 2025 | 12:12 PM