ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: ఆస్తికోసం.. చిన్నాన్నను చంపేశాడు

ABN, Publish Date - Sep 25 , 2025 | 08:28 AM

ఆస్తి కోసం చిన్నాన్ననే హత్య చేశాడో యువకుడు. రాజేంద్రనగర్‌ పోలీసుల కథనం ప్రకారం కర్ణాటకకు చెందిన మినాజుద్దీన్‌ (30) పాతబస్తీ బండ్లగూడ హఫీజ్‌బాబానగర్‌ సీబ్లాక్‌లో కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. అతడు పండ్ల వ్యాపారి.

హైదరాబాద్: ఆస్తి కోసం చిన్నాన్ననే హత్య చేశాడో యువకుడు. రాజేంద్రనగర్‌ పోలీసు(Rajendranagar Police)ల కథనం ప్రకారం కర్ణాటకకు చెందిన మినాజుద్దీన్‌ (30) పాతబస్తీ బండ్లగూడ హఫీజ్‌బాబానగర్‌ సీబ్లాక్‌లో కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. అతడు పండ్ల వ్యాపారి. మినాజుద్దీన్‌ అన్న కుటుంబం పహడీలో ఉంటోంది. కర్ణాటక(Karnataka)లో ఉన్న భూమికి సంబంధించిన పత్రాలను తీసుకుని బుధవారం ఉదయం పహడీలో నివాసం ఉండే అన్న ఇంటికి మిరాజుద్దీన్‌ వచ్చాడు.

ఇంటికి వెళ్లే సమయంలో అన్న కొడుకు అర్బాజ్‌ (26) చిన్నాన్నను ఇంటి దగ్గర విడిచిపెడతానని మిరాజుద్దీన్‌కు చెప్పాడు. స్నేహితుడు సులేమాన్‌ను పిలిచి కారు తీశాడు. సులేమాన్‌ కారు నడుపుతుండగా, మిరాజుద్దీన్‌ డ్రైవర్‌ పక్క సీట్లో కూర్చుని ఉన్నాడు. వెనుకాల సీట్లో ఉన్న అర్బాజ్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం సర్వీస్‌ రోడ్డు వద్దకు కారు వెళ్లగానే మిరాజుద్దీన్‌ను కత్తితో గొంతు కోసి హత్య చేశాడు.

అనంతరం మృతదేహాన్ని అక్కడే వదిలి పారిపోయాడు. సర్వీస్‌ రోడ్డులో మృతదేహం ఉండటాన్ని చూసిన బాటసారులు పోలీసులకు సమాచారం అందించారు. రాజేంద్రనగర్‌ ఏసీపీ శ్రీనివాస్‌, ఇన్‌స్పెక్టర్‌ క్యాస్ట్రో రెడ్డిలు మృతదేహాం వద్ద వేలిముద్రలు సేకరించారు. మిరాజుద్దీన్‌ బంధువు ఇమ్రాన్‌ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు ప్రారంభించారు. అర్బాజ్‌, సులేమాన్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి..

బంగారం ధరలో స్వల్ప తగ్గుదల.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

మతమేదైనా జాతీయతే ప్రధానం

Read Latest Telangana News and National News

Updated Date - Sep 25 , 2025 | 08:28 AM