Hyderabad: దొంగతనాల్లో సెంచరీ అయిపోయిందిగా...
ABN, Publish Date - Jun 27 , 2025 | 10:45 AM
దొంగతనాల్లో అతను సెంచరీ కొట్టాడు. 25 మార్లు పోలీసులు అరెస్ట్ చేశారు. అయినా అతనిలో మార్పు రాలేదు. బెయిల్‌పై వచ్చిన వెంటనే మరో రెండు చోరీలు చేసి గురువారం బండ్లగూడ పోలీసులకు పట్టుబడ్డాడు.
- 25సార్లు అరెస్ట్.. అయినా వీడని చోరీలు
- తాజాగా మరోసారి అరెస్ట్
- 35గ్రా. బంగారు ఆభరణాలు స్వాధీనం
హైదరాబాద్: దొంగతనాల్లో అతను సెంచరీ కొట్టాడు. 25 మార్లు పోలీసులు అరెస్ట్ చేశారు. అయినా అతనిలో మార్పు రాలేదు. బెయిల్‌పై వచ్చిన వెంటనే మరో రెండు చోరీలు చేసి గురువారం బండ్లగూడ(Bandlaguda) పోలీసులకు పట్టుబడ్డాడు. అతని నుంచి 35గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. బండ్లగూడ ఇన్‌స్పెక్టర్ కె.గురునాథ్, డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసరావుతో కలిసి చాంద్రాయణగుట్ట ఏసీపీ సుధాకర్ వివరాలను వెల్లడించారు.
నవాబ్‌సాబ్‌కుంట సంజయ్‌గాంధీ నగర్‌కు చెందిన మహ్మద్ సలీమ్ అలియాస్ సునీల్‌శెట్టి అలియాస్ ఇబ్రహీం అలియాస్ శెట్టి సలీమ్(51) వాల్‌పెయింటర్. జల్సాల కోసం దొంగతనాలకు పాల్పడుతుంటాడు. ఇప్పటివరకు ట్రై కమిషనరేట్ పరిధిలో 100 కేసుల్లో నిందితుడు. ఇప్పటికి 25 సార్లు అరెస్టయ్యాడు. ఏప్రిల్ నెలలో బండ్లగూడ పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించగా మే నెలలో బెయిల్‌పై వచ్చి మళ్లీ ఈ నెల 18న రెండు దొంగతనాలు చేశాడు.
అతన్ని గురువారం అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. అయితే, మహ్మద్ సలీమ్ తన 16వ ఏటనే స్థానికంగా ఉండే ఓ అమ్మాయితో ప్రేమలో పడి ఆమె కోసం దొంగతనాల బాట పట్టినట్లు తెలిసింది. తండ్రి మందలించి ఇంటినుంచి తరిమేయడంతో బయటికి వెళ్లి చోరీలకు పాల్పడుతున్నట్లు తెలిసింది.
ఈ వార్తలు కూడా చదవండి.
నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
‘స్థానికం’లో బీసీ రిజర్వేషన్ల పెంపు..
Read Latest Telangana News and National News
Updated Date - Jun 27 , 2025 | 10:45 AM