ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: సల్మాన్‌ఖాన్‌ ఫొటోను వాట్సాప్‌ డీపీగా పెట్టి...

ABN, Publish Date - Oct 15 , 2025 | 07:06 AM

నకిలీ స్వచ్చంద సంస్థను సృష్టించి సైబర్‌ నేరగాళ్లు వాట్సాప్‌ డీపీగా బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌ ఫొటోను పెట్టారు. రూ.లక్షల్లో రుణాలు ఇప్పిస్తానంటూ బురిడీ కొట్టించి నగరవాసి నుంచి రూ.7.9 లక్షలు కొల్లగొట్టారు. బాధితుడు సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

- రూ.50 లక్షలు లోన్‌ ఇప్పిస్తానని బురిడీ

- రూ.7.9 లక్షలు కొల్లగొట్టిన సైబర్‌ నేరగాళ్లు

హైదరాబాద్‌ సిటీ: నకిలీ స్వచ్చంద సంస్థను సృష్టించి సైబర్‌ నేరగాళ్లు వాట్సాప్‌ డీపీగా బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌(Salman Khan) ఫొటోను పెట్టారు. రూ.లక్షల్లో రుణాలు ఇప్పిస్తానంటూ బురిడీ కొట్టించి నగరవాసి నుంచి రూ.7.9 లక్షలు కొల్లగొట్టారు. బాధితుడు సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డీసీపీ ధార కవిత తెలిపిన వివరాల ప్రకారం.. బేగంపేట(Begumpet)కు చెందిన వ్యాపారికి వాట్సాప్‌ కాల్‌ వచ్చింది. హెచ్‌వైసీ ఎన్జీవో ఫౌండర్‌ను అని, తన సంస్థ నుంచి వ్యాపారులకు తక్కువ వడ్డీకే రూ.లక్షల్లో రుణాలు ఇస్తున్నామని నమ్మించాడు.

వ్యాపారం వృద్ధికి రూ. 50లక్షల వరకు రుణం మంజూరు చేస్తామని బురిడీ కొట్టించాడు. అతని వాట్సాప్‌ డీపీలో సినీ నటుడు సల్మాన్‌ ఖాన్‌(Film actor Salman Khan) ఫొటోను పెట్టాడు. అతని మాటలు నమ్మిన బాధితుడు లోన్‌ ప్రాసె్‌సకు అవసరమైన పత్రాలను వాట్సా్‌పలో పంపాడు. అనంతరం వివిధ నంబర్ల నుంచి ఫోన్‌ చేసిన దుండగులు లోన్‌ ప్రాసెస్‌ గురించి వివరిస్తూ వివిధ చార్జీల కింద రూ. 7.9 లక్షలు వసూలు చేశారు.

వాటిలో కొంతమేర రీఫండ్‌ ఉంటుందని నమ్మబలికారు. లోన్‌ మంజూరు అయిందని చెప్పిన నేరగాళ్లు ఖాతాలో డబ్బులు జమ చేస్తున్నామంటూ కాలయాపన చేశారు. బాధితుడు గట్టిగా నిలదీయడంతో మరో రూ.30వేలు చెల్లిస్తే డబ్బులు ఖాతాలో జమ చేస్తామన్నారు. ఇదేదో మోసంలా ఉందని ఆలస్యంగా గుర్తించిన బాధితుడు సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఈ వార్తలు కూడా చదవండి..

ఆ మూడు దగ్గు మందులు ప్రమాదకరం

షాకింగ్‌ .. ఎమ్‌టీవీ మ్యూజిక్‌ ఛానల్‌ మూసివేత

Read Latest Telangana News and National News

Updated Date - Oct 15 , 2025 | 07:06 AM