ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: నీకు డైమండ్‌ రింగ్‌ పంపుతున్నా..

ABN, Publish Date - Jul 05 , 2025 | 07:27 AM

యూకే నుంచి డైమండ్‌ రింగ్‌, బంగారం, ఖరీదైన దుస్తులు పంపుతున్నానంటూ సైబర్‌ నేరగాళ్లు(Cyber ​​criminals) రూ.2.48 లక్షలు కొల్లగొట్టారు.

- సైబర్‌ నేరగాడి బురిడీ

- నగరవాసి నుంచి రూ.2.48లక్షలు లూటీ

హైదరాబాద్‌ సిటీ: యూకే నుంచి డైమండ్‌ రింగ్‌, బంగారం, ఖరీదైన దుస్తులు పంపుతున్నానంటూ సైబర్‌ నేరగాళ్లు(Cyber ​​criminals) రూ.2.48 లక్షలు కొల్లగొట్టారు. డీసీపీ ధార కవిత తెలిపిన వివరాల ప్రకారం.. సిటీలోని ఆసిఫ్‏నగర్‌(Asifnagar)కు చెందిన 27 ఏళ్ల యువకుడికి సోషల్‌ మీడియాలో యూకేకు చెందిన అమన్‌ప్రీత్‌(Amanpreet) పరిచయం అయ్యాడు. తానొక సంపన్నుడిగా ప్రచారం చేసుకున్నాడు.

కొద్దిరోజులు స్నేహం తర్వాత యూకే నుంచి తనకు డైమండ్‌ రింగ్‌, బంగారం, ఖరీదైన దుస్తులు, డబ్బు, షూస్‌ పంపుతున్నానని చెప్పాడు. రెండు రోజుల తర్వాత ఓ నంబర్‌ నుంచి ఫోన్‌ వచ్చింది. ముంబై ఎయిర్‌పోర్టు(Mumbai Airport) నుంచి కొరియర్‌ ఏజెంట్‌గా పరిచయం చేసుకుని ‘మీ పేరుతో పార్శిల్‌ వచ్చింది. అందులో డైమండ్‌ రింగ్‌, బంగారంతో పాటు ఖరీదైన వస్తువులు ఉన్నాయి. వాటిని కస్టమ్స్‌ అధికారులు సీజ్‌ చేశారు. కొరియర్‌ సర్వీసు, కస్టమ్స్‌, పన్ను చార్జీల కోసం రూ.16వేలు చెల్లించాలి.

లేదంటే ఆదాయపన్ను శాఖ అధికారులు చర్యలు తీసుకుంటారు’ అని బెదిరించాడు. నిజమని నిమ్మిన బాధితుడు వారు చెప్పిన ఖాతాకు డబ్బులు బదిలీ చేశాడు. ఆ తర్వాత విడతల వారీగా ఫోన్లు చేసిన నేరగాళ్లు అక్రమ పార్శిల్‌ అంటూ భయపెట్టి వివిధ రకాల చార్జీల పేరుతో రూ.2.48లక్షలు కొల్లగొట్టారు. ఆ తర్వాత కాంటాక్ట్‌ కట్‌ చేశారు. మోసపోయినట్లు ఆలస్యంగా గుర్తించిన బాఽధితుడు శుక్రవారం సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఈ వార్తలు కూడా చదవండి.

విశాఖ వందేభారత్‌కు ఇకపై 20 బోగీలు

నిరుద్యోగుల కష్టాలు కనబడట్లేదా...

Read Latest Telangana News and National News

Updated Date - Jul 05 , 2025 | 07:27 AM