Hyderabad: మూలికల పూజ కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి..
ABN, Publish Date - Aug 12 , 2025 | 09:33 AM
చెట్ల నుంచి సేకరించిన వివిధ మూలికలతో భస్మం చేసి అందులో నుంచి బంగారం తీస్తామంటూ వ్యాపారిని మోసం చేసిన కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. ఇప్పటికే ముగ్గురు స్వామీజీలను పోలీసులు అదుపులోకి తీసుకోగా మరో మోసగాడు కూడా ఉన్నట్టు నిర్ధారణ అయింది.
- అఘోరా అవతారంలో నిర్మానుష్య ప్రదేశంలో పూజలు చేసినట్లు నిర్ధారణ
హైదరాబాద్: చెట్ల నుంచి సేకరించిన వివిధ మూలికలతో భస్మం చేసి అందులో నుంచి బంగారం తీస్తామంటూ వ్యాపారిని మోసం చేసిన కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. ఇప్పటికే ముగ్గురు స్వామీజీలను పోలీసులు అదుపులోకి తీసుకోగా మరో మోసగాడు కూడా ఉన్నట్టు నిర్ధారణ అయింది. ఈ మోసగాడు అఘోరా అవతారం ఎత్తి నిర్మానుష్య ప్రదేశంలో పూజలు చేసినట్టు విచారణలో తేలింది.
ప్రధాన నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. బంజారాహిల్స్ ఎన్‌బీటీనగర్(Banjara Hills NBT Nagar)లో నివసిస్తున్న గోపాల్ ఐదు రోజుల క్రితం ఎమ్మెల్యే కాలనీ వైపు వెళ్తుండగా కోయ దొరల వేషంలో కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు అతడిని ఆపి నీ బాధలు ఏమిటని ప్రశ్నించారు. తనకు ఏపనీ కలిసి రావడం లేదని, ఆర్థిక, కుటుంబ సమస్యలు అతడు చెప్పాడు. మూలికలకు పూజలు చేస్తే ఇంట్లోకి బంగారం వస్తుందని గోపాల్‌ను వారు నమ్మించారు.
ఆ మూలికలు నిజాంపేటలోగల ఓ ఆయుర్వేద షాపులో మాత్రమే దొరుకుతుందని అతడికి చెప్పారు. వారి మాటలు నమ్మిన బాధితుడు రూ. 10 లక్షలు చెల్లించి మూలికలు కొనుగోలు చేసి కోయ దొరల వేషంలో ఉన్న వారికి ఇచ్చాడు. నెల రోజుల పాటు పూజ చేసి ఓ మూటను గోపాల్‌కు ఇచ్చి ఇంట్లో మరో వారం పూజ చేయాలని సూచించారు. ఐదో రోజు బాధితుడికి అనుమానం వచ్చి మూట విప్పి చూడగా బంగారు రంగు వేసిన ఇనుప ముక్కలు లభించాయి. మోసపోయినట్టు గ్రహించి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
సీసీ ఫుటేజీలు పరిశీలించి నిజాంపేటలోని ఆయుర్వేద షాపు నిర్వాహకులు సుధీర్‌కుమార్‌సింగ్, సాగర్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా.. బిహార్, మహారాష్ట్ర చెందిన వారితో వేషాలు వేయించి అమాయకులను దోచుకోవడం లక్ష్యంగా పెట్టుకున్నట్టు తేలింది. వారిచ్చిన సమాచారం ఆధారంగా పంకజ్ అనే వ్యక్తిని కూడా అరెస్టు చేశారు. అఘోరా వేషంలో ఉన్న వ్యక్తితో పాటు మరికొంత మంది గురించి పోలీసులు గాలిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
గుడ్ న్యూస్, భారీగా తగ్గిన బంగారం ధరలు.. కానీ వెండి మాత్రం..
చట్టాలు తెలుసుకుని అమెరికా రండి
Read Latest Telangana News and National News
Updated Date - Aug 12 , 2025 | 11:54 AM