ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: మన్నె క్రిశాంక్‌కు మాదాపూర్‌ పోలీసుల నోటీసులు

ABN, Publish Date - Apr 23 , 2025 | 08:30 AM

భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) సోషల్‌ మీడియా కన్వీనర్‌ మన్నె క్రిశాంక్‌కు మాదాపూర్‌ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ సందర్బంగా మన్నె క్రిశాంక్‌ మీడియాతో మాట్లాడుతూ.. మాదాపూర్‌ పోలీసులు తన ఫోన్‌ను సీజ్‌ చేశారని, ఇప్పటికీ అది వారి వద్దే ఉందని తెలిపారు.

హైదరాబాద్‌ సిటీ: బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా కన్వీనర్‌ మన్నె క్రిశాంక్‌(BRS Social Media Convener Manne Krishank)కు మాదాపూర్‌ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ విషయమై మన్నె క్రిశాంక్‌ మంగళవారం విలేకరులతో మాట్లాడారు. మాదాపూర్‌ పోలీసులు తన ఫోన్‌ అడుగుతున్నారని తెలిపారు. అలాగే గచ్చిబౌలి పోలీసులు కూడా అడుగుతున్నారని, ఒకటే ఫోన్‌ ఎంత మందికి ఇవ్వాలని ఆయన అసహనం వ్యక్తం చేశారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: విద్యుత్‌ బిల్లు బకాయి పేరిట వృద్ధుడికి బురిడీ


గతంలోనే ఒక కేసు విషయమై మాదాపూర్‌ పోలీసులు తన ఫోన్‌ను సీజ్‌ చేశారని, ఇప్పటికీ అది వారి వద్దే ఉందని తెలిపారు. గతంలో గచ్చిబౌలి పోలీసులు(Gachibowli Police) తనకు నోటీసులు ఇచ్చినప్పుడు సోషల్‌ మీడియా అని కాకుండా సోడా మీడియా కన్వీనర్‌ అని టైప్‌ చేశారని, మాదాపూర్‌ పోలీసులు ఇచ్చిన దాంట్లోనూ అదే పదం ఉందని తెలిపారు. బహుశా వీటిని సీఎం కార్యాలయం నుంచి పంపుతున్నారేమోనని క్రిశాంక్‌ ఆరోపించారు.


ఈ వార్తలు కూడా చదవండి

ఆర్టీసీలో సమ్మెకు సై...జేఏసీకి సంఘాల మద్దతు

ఏపీ నుంచి రాజ్యసభకు అన్నామలై

Singareni: సింగరేణి ఉపకార వేతనం

ఫస్ట్ టైం తెలుగులో...

Read Latest Telangana News and National News

Updated Date - Apr 23 , 2025 | 08:31 AM