Karur Vysya Bank: బ్యాంక్ లాకర్లలో బంగారానికి రెక్కలు.. కిలో నగలు చోరీ
ABN, Publish Date - Oct 15 , 2025 | 10:02 AM
బ్యాంక్ లాకర్లలో దాచిన బంగారానికి రెక్కలు వచ్చాయి. కరూర్ వైశ్యా బ్యాంక్‌లో సుమారు కిలో నగలు చోరీ అయిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
- పోలీసులకు కరూర్ వైశ్యా బ్యాంక్ లీగల్ అడ్వైజర్ ఫిర్యాదు
హైదరాబాద్: బ్యాంక్ లాకర్లలో దాచిన బంగారానికి రెక్కలు వచ్చాయి. కరూర్ వైశ్యా బ్యాంక్(Karur Vysya Bank)లో సుమారు కిలో నగలు చోరీ అయిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మోతీనగర్‌లోని కరూర్ వైశ్యాబ్యాంక్ లాకర్‌లో దామోదర్‌రెడ్డి(Damodar Reddy) అనే ఖాతాదారుడు బంగారం దాచుకున్నాడు. ఇటీవల లాకర్ ఓపెన్ చేసి చూడగా కొన్ని నగలు కనిపించకపోవడంతో బ్యాంక్ అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో వారు లాకర్లలో నగలు దాచుకున్న 15 మంది ఖాతాదారులను పిలిపించి లాకర్లు తెరిపించారు.
నగలు చూసుకోగా కొన్ని కనిపించలేదు. బ్యాంక్ అధికారులకు అనుమానం వచ్చి పదేళ్ల క్రితం పనిచేసిన అప్రైజర్ సతీష్ కుమార్‌ను పిలిచి అడగగా.. నగలను ఇస్తానని అంగీకరించాడు. తన భర్త సతీ్‌షకుమార్ కనిపించడం లేదని అతడి భార్య బాచుపల్లి పోలీస్‌స్టేషన్(Bachupalli Police Station)లో ఇటీవల ఫిర్యాదు చేసింది. బ్యాంక్ లీగల్ అడ్వైజర్ అజ్మతుల్లా బోరబండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
షాకింగ్ .. ఎమ్‌టీవీ మ్యూజిక్ ఛానల్ మూసివేత
Read Latest Telangana News and National News
Updated Date - Oct 15 , 2025 | 10:02 AM