ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

రోడ్డు ప్రమాదంలో ఫిల్మ్‌నగర్‌ ఎస్‌ఐ దుర్మరణం

ABN, Publish Date - Jul 04 , 2025 | 07:43 AM

ఇండికేటర్స్‌ వేయకుండా రోడ్డు పక్కన నిలిపి ఉంచిన లారీని కారు ఢీకొన్న ఘటనలో ఫిల్మ్‌నగర్‌ ఎస్‌ఐ రాజేశ్వర్‌ దుర్మరణం పాలయ్యారు. సంగారెడ్డి రూరల్‌ ఎస్‌ఐ రవీందర్‌ తెలిపిన వివరాలిలా ఉన్నాయి

- ఆగిఉన్న లారీని ఢీ కొట్టిన కారు

- సంగారెడ్డి జిల్లా కంది శివారులో ఘటన

కంది(సంగారెడ్డి): ఇండికేటర్స్‌ వేయకుండా రోడ్డు పక్కన నిలిపి ఉంచిన లారీని కారు ఢీకొన్న ఘటనలో ఫిల్మ్‌నగర్‌ ఎస్‌ఐ రాజేశ్వర్‌(Filmnagar SI Rajeshwar) దుర్మరణం పాలయ్యారు. సంగారెడ్డి రూరల్‌ ఎస్‌ఐ రవీందర్‌ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని చాణక్యపురి కాలనీలో నివాసం ఉంటున్న ఎం.రాజేశ్వర్‌ (54) వారం రోజుల క్రితం హైదరాబాద్‌(Hyderabad)లోని ఫిల్మ్‌నగర్‌కు బదిలీ అయ్యారు.

బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు బల్కంపేట ఎల్లమ్మ ఆలయం(Balkampet Yellamma Temple) వద్ద బందోబస్తు డ్యూటీ చేశారు. అర్ధరాత్రి తర్వాత సంగారెడ్డి(Sangareddy)కి కారులో తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో కంది శివారులోని చేర్యాల గేటు వద్ద జాతీయ రహదారి పక్కన నిలిపి ఉంచిన లారీని వెనక నుంచి రాజేశ్వర్‌ ఢీకొట్టారు. ఈ ఘటనలో ఎస్‌ఐ తలకు తీవ్రగాయమై రక్తస్రావం జరిగింది.

కారు ముందు భాగం మొత్తం నుజ్జునుజ్జయింది. హైవే పెట్రోలింగ్‌ పోలీసులు వెంటనే ఆయనను సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. నాలుగు నెలల క్రితమే ఎస్‌ఐగా ప్రమోషన్‌ పొందిన రాజేశ్వర్‌ వారం రోజుల క్రితమే ఫిల్మ్‌నగర్‌ ఎస్‌ఐగా బాధ్యతలు చేపట్టారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. సంగారెడ్డి మార్కెట్‌లో ఉన్న శ్మశానవాటికలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.

ఈ వార్తలు కూడా చదవండి.

పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు..

రిజర్వేషన్లు అమలు తర్వాతే ఎన్నికలు నిర్వహించాలి

Read Latest Telangana News and National News

Updated Date - Jul 04 , 2025 | 07:43 AM