ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Chennai: తన పోలికలు లేవని బిడ్డను హతమార్చిన కసాయి అరెస్టు

ABN, Publish Date - Mar 18 , 2025 | 12:07 PM

తన పోలికలతో పుట్టలేదంటూ.. ఆడపిల్లను దారుణంగా హతమార్చాడో దుర్మార్గుడు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో ఈరోడ్‌ జిల్లాలో చోటుచేసుకుంది. అయితే చిన్నారిని హతమార్చిన అతడిని పోలీసులు అరెస్టు చేశారు.

చెన్నై: ఈరోడ్‌ జిల్లా మేట్టుపాళయం వద్ద తన పోలికలు లేవనే అనుమానంతో ఆడబిడ్డను దారుణంగా హతమార్చిన తండ్రిని పోలీసులు అరెస్టు చేశారు. మేట్టుపాళయంలో నివసిస్తున్న కుమారగురు, పాండిసెల్లి అనే దంపతలుకు యేడాది క్రితం కవల పిల్లలు జన్మించారు. ఆడబిడ్డకు దీపాశ్రీ(Deepa Sri) అని, మగబిడ్డకు దివాన్‌ అనే పేర్లుపెట్టారు.

ఈ వార్తను కూడా చదవండి: BJP: టాస్మాక్‌ అవినీతిపై బీజేపీ పోరు.. త్వరలో సీఎం ఇంటి ముట్టడి


గత కొద్ది మాసాలుగా కుమారుగురు తన ఇద్దరు కవల పిల్లలు తనకు పుట్టలేదనే అనుమానం వ్యక్తం చేశాడు. దీంతో తరచూ దంపతుల మధ్య గొడవలు జరుగుతుండేవి. ఇదిలా ఉండగా జ్వరంతో బాధపడుతున్న దివాన్‌ను పాండిసెల్లి ఆస్పత్రికి తీసుకెళ్లింది. ఆ సమయంలో ఇంటిలో ఉన్న కుమారుగురు కుమార్తె ఏడవడంతో చితక బాదాడు. అంతటితో ఆగకుండా బిడ్డ తలను గోడకేసి కొట్టాడు.


దీంతో ఆ ఆడబిడ్డ ప్రాణాలు కోల్పోయింది. ఆస్పత్రి నుండి తిరిగొచ్చిన భార్యకు తన కుమార్తె ఉన్నట్టుండి అస్వస్థతకు గురై మరణించినట్లు చెప్పాడు. వెంటనే పాండిసెల్లి తన బిడ్డ మృతిపై అనుమానాలున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, పోలీసుల ఎదుట కుమారగురు తన నేరాన్ని అంగీకరించాడు. ఆ తర్వాత కుమారుగురును పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు.


ఈ వార్తలు కూడా చదవండి:

టన్నుల్లో స్మగ్లింగ్‌.. గ్రాముల్లో పట్టివేత

టికెట్‌ సొమ్ము వాపస్ కు 3 రోజులే గడువు

ఛీ.. మీరసలు మనుషులేనా.. ఇంత దారుణమా..

వారణాసిలో రోడ్డు ప్రమాదం.. సంగారెడ్డి వాసులు మృతి

Read Latest Telangana News and National News

Updated Date - Mar 18 , 2025 | 12:07 PM