ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: బ్రాండెడ్‌ పేరుతో నకిలీ ఆయిల్‌..

ABN, Publish Date - Mar 27 , 2025 | 07:30 AM

బ్రాండెడ్‌ పేరుతో నకిలీ ఆయిల్‌ అంటకడుతున్న వారి ఆట కట్టించారు సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు. గత కొంతకాలంగా హైదరాబాద్ కేంద్రంగా ఆన్‌లైన్‌ మోసాలు, సైబర్ నేరాలు ఎక్కువయ్యాయి. ప్రజల్లో కొంత అవగాహన లేమీతో ఈ తరహ మోసాలకు అంతే లేకుండా పోతోంది. అలాంటి మోసమే తాజాగా నగరంలో వెలుగుచూసింది.

- సైబర్‌ క్రిమినల్‌ అరెస్ట్‌

హైదరాబాద్‌ సిటీ: బ్రాండెడ్‌ పేరుతో ఆన్‌లైన్‌లో నకిలీ ఆయిల్‌ను విక్రయిస్తున్న వ్యక్తిని సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు(City Cyber ​​Crime Police) అరెస్ట్‌ చేశారు. సైబర్‌ క్రైమ్‌ డీసీపీ ధార కవిత(Cyber ​​Crime DCP Dhara Kavitha) తెలిపిన వివరాల ప్రకారం పునర్జీవని ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ వారు రాబిట్‌ బ్లడ్‌ హెయిర్‌ ఆయిల్‌ను తయారు చేసి విక్రయిస్తున్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: ఎట్టకేలకు ఆమె ఆట కట్టించేశారుగా. ఏం జరిగిందంటే...


కాగా, ఇండియా పీవీవై లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సుశాంత్‌ సింగ్‌, ప్రతీక్‌కుమార్‌లతో కలిసి మధ్యప్రదేశ్‌కు చెందిన విశేష్‌ ఆహుజా పునర్జీవని ప్రై.లిమిటెడ్‌ పేరుతో నకిలీ వెబ్‌సైట్‌ను సృష్టించారు. వారు తయారు చేసిన నకిలీ ఆయిల్‌ను రాబిట్‌ బ్లడ్‌ హెయిర్‌ ఆయిల్‌ బ్రాండ్‌తో ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నారు. కంపెనీ ప్రతినిధుల ఫిర్యాదు మేరకు పోలీసులు సుశాంత్‌సింగ్‌, ప్రతీక్‌ కుమార్‌లను ఈనెల 4న అరెస్ట్‌ చేశారు. తాజాగా బుధవారం విశేష్‌ ఆహుజాను అరెస్ట్‌ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి:

‘పది’ ప్రశ్నపత్రం లీకేజీకి రాజకీయ రంగు

ఉప ఎన్నికలు రావు

‘ఉపాధి’కి పెరిగిన పని దినాలు

Read Latest Telangana News and National News

Updated Date - Mar 27 , 2025 | 07:30 AM