Hyderabad: ఈ కాంగ్రెస్ నేత మామూలోడు కాదుగా.. ఏం చేశాడంటే...
ABN, Publish Date - May 20 , 2025 | 10:29 AM
ఓ కాంగ్రెస్ పార్టీ నేత చేసిన మోసాల దందా వెలుగులోకి వచ్చింది. ఈయనపై ఇప్పటికే పలు ఆరోపణలు రాగా తాజాగా.. కేపీహెచ్‌బీ పోలీసులు కేసు నమోదు చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం ముసుగులో కోట్లాది రూపాయలను పలువురి వద్దనుంచి తీసుకుని మోసాలకు పాల్పడ్డాడు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
- సతీష్‌రెడ్డిపై చీటింగ్ కేసు
హైదరాబాద్: రియల్ ఎస్టేట్ వ్యాపారి వద్ద డబ్బులు తీసుకుని మోసం చేసిన కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు శేరి సతీష్‌రెడ్డి(Sheri Satish Reddy)పై కేపీహెచ్‌బీ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు, బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. సనత్‌నగర్ జెక్‌కాలనీకి చెందిన రౌతు మురళీమోహన్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు. 2022లో మల్లికార్జున్ అనే ఏజెంట్ ద్వారా సంగారెడ్డి(Sangareddy) జిల్లా ఇంద్రకరణ్ గ్రామంలోని సర్వే నంబర్ 359, 364లో 11 ఎకరాల 22గుంటల భూమి అమ్మకానికి ఉందని తెలిసింది.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: నమ్మించి గొంతు కోయడమంటే ఇదేనేమో.. ఏం జరిగిందో తెలిస్తే..
ఆ భూమికి సంబంధించిన విషయాలను శేరి సతీష్‌రెడ్డి చూస్తున్నాడని మల్లికార్జున్ ద్వారా తెలుసుకుని అతనితో కలిసి వెళ్లి సతీష్‌రెడ్డిని కలిశాడు. ఆ భూమి తన అక్క జయశ్రీ, బావ బ్రహ్మానందరెడ్డి వాళ్లదని చెప్పిన సతీష్‌రెడ్డి 2 ఎకరాలను రూ.3.40కోట్లకు కొనుగోలు చేస్తే మిగిలిన భూమిని డెవలప్మెంట్కు ఇచ్చేట్టుగా ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో మురళీమోహన్ పలు దఫాలుగా సతీష్‌రెడ్డికి రూ.2.7 కోట్లు చెల్లించాడు. వీటితో పాటు జయశ్రీ పేరుమీద రూ.కోటికి చెక్కు ఇచ్చాడు.
చెక్ బౌన్స్ అయిందంటూ..
కొన్ని రోజుల తర్వాత ఆ చెక్ బౌన్స్ అయిందని కేసు పెట్టిన సతీష్‌రెడ్డి మురళీమోహన్ దగ్గర రూ.కోటి వసూలు చేశాడు. అదే సంవత్సరం అక్టోబరు 29న కోటి రూపాయాలు తీసుకుని మురళీమోహన్‌కు డెవల్‌పమెంట్ అగ్రిమెంట్ చేశాడు. ఆ తర్వాత జయశ్రీని సంప్రదించగా మరో రూ.కోటి ఇస్తేనే రిజిస్ర్టేషన్ చేస్తామని చెప్పారు. దీంతో వారు అడిగిన డబ్బు చెల్లించి భూమిని రిజిస్ర్టేషన్ చేయించుకున్నాడు. అయితే, తనను సతీష్ రెడ్డి, జయశ్రీ, బ్రహ్మనందరెడ్డి మోసం చేశారని శనివారం కేపీహెచ్‌బీ పోలీసులకు మురళీమోహన్ ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరో కేసులో..
తనను అసభ్య పదజాలంతో దూషించాడని కాంగ్రెస్ యువనాయకుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సతీష్‌రెడ్డిపై కేపీహెచ్‌బీ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేపీహెచ్‌బీ ఎస్‌ఐ శ్రీనివాస్‌యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం.. సతీష్‌రెడ్డి, అతని అనుచరుడు బచ్చుపల్లి తనను అసభ్య పదజాలంతో దూషించారని కాంగ్రెస్ యువ నాయకుడు శివచౌదరి ఈ నెల 3న కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కోర్టు అనుమతి తీసుకుని కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
Gold Rates Today: తగ్గిన ధరలకు బ్రేక్.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు
Rice Production: సస్యశ్యామల భారతం
Siricilla : పాత బకాయిలు లేనట్లేనా..?
Telangana fire services: ఇక.. మహిళా ఫైర్‌ఫైటర్లు
Read Latest Telangana News and National News
Updated Date - May 20 , 2025 | 10:29 AM