AP News: డ్రోన్‌కు చిక్కిన జూదరులు..
ABN, Publish Date - Aug 21 , 2025 | 12:50 PM
కింద పట్ట పరిచారు. ఒక పక్క పరదా కట్టారు. ఇలా రోడ్డుకు దూరంగా పొలాల్లో పేకాట స్థావరం పెట్టారు. ఎక్కడో పొలాల్లో ఉన్న తమను ఎవరు పట్టుకుంటారులే అని ధీమాగా పేకాట ఆడుతున్న వారు.. ఆకాశం నుంచి నిఘా పెట్టిన డ్రోన్‌కు చిక్కారు.
- 11మంది అరెస్టు.. 9 మంది పరారీ
- రూ.2,36,740, 12సెల్‌ఫోన్లు, 4 బైక్‌లు స్వాధీనం
ఏర్పేడు(తిరుపతి): కింద పట్ట పరిచారు. ఒక పక్క పరదా కట్టారు. ఇలా రోడ్డుకు దూరంగా పొలాల్లో పేకాట స్థావరం పెట్టారు. ఎక్కడో పొలాల్లో ఉన్న తమను ఎవరు పట్టుకుంటారులే అని ధీమాగా పేకాట ఆడుతున్న వారు.. ఆకాశం నుంచి నిఘా పెట్టిన డ్రోన్‌కు చిక్కారు. ఏర్పేడు మండలం మేర్లపాక, బండారుపల్లి, ముసలిపేడు, కందాడు, రామలింగాపురం(Ramalingapuram) గ్రామాల్లో డ్రోన్ ద్వారా పోలీసు బీట్ పెట్టారు. సైబర్ క్రైం సీఐ, డ్రోన్ కెమెరాల ఇన్‌ఛార్జి వినోద్‌కుమార్ పర్యవేక్షణలో పది మంది పోలీసులు పేకాట స్థావరాలపై డ్రోన్ నిఘా పెట్టారు.
బండారుపల్లి, ముసలిపేడు సరిహద్దు పొలాల్లో పేకాట ఆడుతున్నట్లు గుర్తించారు. పేకాట ఆడుతున్న మూడు ప్రాంతాలపై దాడులు నిర్వహించి 11మందిని అదుపులోకి తీసుకున్నారు. మరో 9మంది పరారయ్యారు. పేకాట స్థావరాల నుంచి రూ.2,36,740 నగదు, 12 సెల్‌ఫోన్లు, నాలుగు బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో తిరుపతికి చెందిన ఇద్దరు, కడపకు చెందిన ఐదుగురు, అన్నమయ్య జిల్లా రాజంపేటకు చెందిన ఇద్దరు, కోడూరుకు చెందిన ఒకరు, కలకడకు చెందిన ఒకరు చొప్పున ఉన్నారు. వీరిని ఏర్పేడు పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అర్హులైన చేనేతలందరికీ ముద్ర రుణాలు
శ్రీవారికి 121 కిలోల బంగారు కానుక
Read Latest Telangana News and National News
Updated Date - Aug 21 , 2025 | 12:50 PM