ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: అడ్రస్‌ అప్‌డేట్‌ చేయాలంటూ.. రూ3.92 లక్షలు స్వాహా

ABN, Publish Date - Jun 10 , 2025 | 06:56 AM

బ్యాంకు అధికారినంటూ ఫోన్‌ చేసిన సైబర్‌ నేరగాడు అడ్రస్‌ అప్‌డేట్‌ పేరుతో రూ.3.92 లక్షలు కాజేశాడు. ముషీరాబాద్‌కు చెందిన ప్రభుత్వ ఉద్యోగి(59)కి ఈనెల 4న 9123317117 నంబర్‌ నుంచి ఫోన్‌ చేసిన సైబర్‌ నేరగాడు తాను ఎస్‌బ్యాంక్‌ రిలేషన్‌ షిప్‌ మేనేజర్‌నని పరిచయం చేసుకున్నాడు.

- సైబర్‌ నేరగాడి టోకరా

హైదరాబాద్‌ సిటీ: బ్యాంకు అధికారినంటూ ఫోన్‌ చేసిన సైబర్‌ నేరగాడు అడ్రస్‌ అప్‌డేట్‌ పేరుతో రూ.3.92 లక్షలు కాజేశాడు. ముషీరాబాద్‌(Musheerabad)కు చెందిన ప్రభుత్వ ఉద్యోగి(59)కి ఈనెల 4న 9123317117 నంబర్‌ నుంచి ఫోన్‌ చేసిన సైబర్‌ నేరగాడు తాను ఎస్‌బ్యాంక్‌ రిలేషన్‌ షిప్‌ మేనేజర్‌నని పరిచయం చేసుకున్నాడు. ఖాతా వివరాలు చెప్పడంతో పాటు అడ్రస్‌లో తప్పు ఉందని, దానిని సరిచేసుకోవాలని సూచించాడు. అందుకోసం ధ్రువపత్రాలు పంపాలని సూచించాడు.

అతడు చెప్పిన విధంగా బాధితుడు పత్రాలను పంపాడు. తర్వాత కొద్ది సేపటికి సైబర్‌ నేరగాడు ఏపీకే ఫైల్‌ను పంపాడు. దీంతో ఫోన్‌ స్విచ్చాఫ్‌ అయింది. ఆ సమయంలో బాధితుడి ఫోన్‌ నుంచి సైబర్‌ నేరగాళ్లు(Cyber ​​criminals) రూ.3.92 లక్షలు కాజేశారు. ఈ విషయం గుర్తించిన బాధితుడు వెంటనే సైబర్‌ క్రైం పోలీసులకు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు.

ఈ వార్తలు కూడా చదవండి.

బస్‌పాస్‌ చార్జీల బాదుడు

నిన్ను ఏమడిగారు.. నేనేం చెప్పాలి

Read Latest Telangana News and National News

Updated Date - Jun 10 , 2025 | 06:56 AM