Chennai News: పెళ్లింట విషాదం.. బాత్రూమ్‌లో పెళ్లికూతురి అనుమానాస్పద మృతి
ABN, Publish Date - Nov 01 , 2025 | 12:04 PM
పెళ్లిపీటలెక్కాల్సిన ఓ యువతి బాత్రూమ్‌లో అనుమానాస్పదంగా మృతిచెందిన సంఘటన తిరువళ్లూరు జిల్లా పళ్లిపట్టు సమీపంలోని అత్తిమాంజేరిపేటలో చోటుచేసుకుంది.
చెన్నై: పెళ్లిపీటలెక్కాల్సిన ఓ యువతి బాత్రూమ్‌లో అనుమానాస్పదంగా మృతిచెందిన సంఘటన తిరువళ్లూరు(Tiruvallur) జిల్లా పళ్లిపట్టు సమీపంలోని అత్తిమాంజేరిపేటలో చోటుచేసుకుంది. వివరాలిలా.. అత్తిమాంజేరిపేటకు చెందిన సంధ్య (23)అనే యువతికి ఆ గ్రామంలో నివసిస్తున్న రాముమణికి శుక్రవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు(Andhra Pradesh State Chittoor)లోని బలిజ కండ్రిగలోని టీటీడీ కల్యాణ మండపంలో వివాహం జరగాల్సివుంది.
ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం వరుడి ఇంట్లో మ్యారేజ్ రిసెప్షన్‌కు వారిపెద్దలు ఏర్పాట్లు చేయగా, రిసెప్షన్‌కు రెడీ అవుతానని చెప్పి బాత్రూమ్‌కు వెళ్లిన సంధ్య ఎంతసేపటికీ బయటికి రాకపోవడంతో తలుపులు పగులగొట్టి చూడగా, సంధ్య స్పృహ కోల్పోయి పడివుంది. వెంటనే ఆమె బంధువులు ఆస్పత్రికి తరలించగా, పరిశీలించిన వైద్యులు ఆమె మృతిచెందినట్లు నిర్థారించారు. ఆస్పత్రికి చేరుకున్న పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి..
డిగ్రీ విద్యార్థిని అనుమానాస్పద మృతి
Read Latest Telangana News and National News
Updated Date - Nov 01 , 2025 | 12:04 PM