Chennai News: మద్యం తాగనివ్వలేదని ఆ వ్యక్తి చేసిన పనేంటో తెలిస్తే..
ABN, Publish Date - Oct 23 , 2025 | 12:40 PM
మద్యం తాగనీయకుండా కూతురు అడ్డుకుందన్న మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కన్నియాకుమారిలో చోటుచేసుకుంది. ముంగిల్‌విలైలో నివసిస్తున్న భవన నిర్మాణ కార్మికుడు రాజేంద్రన్ (49)కు అఖిల (47) అనే భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
చెన్నై: మద్యం తాగనీయకుండా కూతురు అడ్డుకుందన్న మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కన్నియాకుమారి(Kanniyakumari)లో చోటుచేసుకుంది. ముంగిల్‌విలైలో నివసిస్తున్న భవన నిర్మాణ కార్మికుడు రాజేంద్రన్ (49)కు అఖిల (47) అనే భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మద్యం అలవాటు ఉన్న రాజేంద్రన్, ప్రతిరోజు రాత్రి మద్యం సేవించి ఇంటికి వచ్చి భార్యతో గొడవపడుతుంటాడని సమాచారం. ఘటన జరిగిన రోజున రాజేంద్రన్(Rajendran), తాను తీసుకొచ్చిన మద్యం బాటిల్ బీరువాలో దాచాడు.
గమనించిన కుమార్తె బాటిల్ తీసుకొని బయటకు వచ్చి రాజేంద్రన్ కళ్ల ముందే మద్యం కిందపోసింది. దీంతో, ఆగ్రహించిన రాజేంద్రన్, ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగాడు. దిగ్బ్రాంతి చెందిన కుటుంబ సభ్యులు అతడిని వెంటనే ఆచారిపల్లం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా, అక్కడ చికిత్స ఫలించక రాజేంద్రన్ మృతిచెందాడు. ఈ ఘటనపై మనవాలకుర్చి పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. బంగారం ధర మరింత తగ్గింది..
మావోయిస్టు మద్దతుదారులపై నజర్!
Read Latest Telangana News and National News
Updated Date - Oct 23 , 2025 | 12:40 PM