ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

BJP MLA: రౌడీషీటర్‌ హత్య కేసులో బీజేపీ ఎమ్మెల్యేపై ఎఫ్‌ఐఆర్‌

ABN, Publish Date - Jul 17 , 2025 | 01:22 PM

భారతినగర్‌ ప్రాంతంలో రౌడీషీటర్‌ శివప్రకాశ్‌ అలియాస్‌ బిట్లు శివ హత్య కేసులో బీజేపీ ఎమ్మెల్యే బైరతి బసవరాజ్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. మంగళవారం రాత్రి భారతినగర్‌లో కారులో వచ్చిన వ్యక్తులు హత్య చేశారనే ఆరోపణలు ఉన్నాయి. మృతుడి తల్లి విజయలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

బెంగళూరు: భారతినగర్‌ ప్రాంతంలో రౌడీషీటర్‌ శివప్రకాశ్‌ అలియాస్‌ బిట్లు శివ హత్య కేసులో బీజేపీ ఎమ్మెల్యే బైరతి బసవరాజ్‌(BJP MLA Bairati Basavaraj)పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. మంగళవారం రాత్రి భారతినగర్‌లో కారులో వచ్చిన వ్యక్తులు హత్య చేశారనే ఆరోపణలు ఉన్నాయి. మృతుడి తల్లి విజయలక్ష్మి(Vijayalakshmi) ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. శివప్రకాశ్‌పై ఏడెనిమిదిమంది రాడ్‌లు, వేటకొడవళ్లతో దాడిచేసి హత్య చేశారని అతడి మిత్రుడు అడ్డుకునేందుకు వెళ్తే అతడిపైనా దాడి చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

తాను కేకలు వేయడంతో గుర్తు తెలియని వ్యక్తులు కారులో పరారీ అయ్యారన్నారు. వారిలో కొందరిని గుర్తించగలనని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. శివప్రకాశ్‌పై 11 కేసులు ఉండగా 2006లో రౌడీషీట్‌ తెరిచారు. కాగా ఐదో నిందితుడిగా బైరతి బసవరాజ్‌(Byrati Basavaraj) పేరు నమోదు చేశారు. మిగిలినవారిలో జగదీశ్‌, కిరణ్‌, విమల్‌, అనిల్‌ ఉన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 11న జగదీశ్‌, కిరణ్‌లు కిత్తగనూరులో శివప్రకాశ్‌ ఆస్తిని ఆక్రమించుకున్నారని అప్పటినుంచే వివాదం తలెత్తినట్టు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి.

తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

తాటి చెట్టే లేదు.. లక్షల లీటర్ల కల్లా..

Read Latest Telangana News and National News

Updated Date - Jul 17 , 2025 | 01:22 PM